E-Paper
Advertisement

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు
Advertisement

KTR: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి.. ఇంటింట సంక్షోభాన్ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ తీసుకున్న పంటల కొనుగోలు నిర్ణయం.. రాష్ట్ర రైతాంగానికి ఉరితాడుగా మారబోతుందని కేటీఆర్ అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఒకటే ఆవేదన ఆక్రందన కనిపిస్తోంది. గత రెండున్నర ఏండ్లలో రాష్ట్రం సంక్షోభంలోకి జారుకుందని ఆరోపించారు.

కాంగ్రెస్ ని నమ్మి ప్రజలు ఓటేస్తే అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో పంటలు పండించిన ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మోడీ చెప్తేనే కొంటానని అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వచ్చే సీజన్ నుంచి రైతన్నలు పూర్తి సంక్షోభంలోకి కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఎరువుల కొరత, కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతులకు ఇది మరింత గుదిబండలా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై యుద్దం చేస్తాను.. ప్రతీ గింజను కొంటానని మెున్నటికి మెున్న చెప్పి ఇలా నాలుక మడత పెట్టడం రేవంత్ కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఇలాంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన మళ్లీ తిరగబడి కొట్లాడితేనే పరిస్థితులు మారుతాయని కేటీఆర్ అన్నారు. అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తూనే ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదన్న కేటీఆర్.. ఇంకో ఏడాదిన్నర కాలం కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగింపు పలకవచ్చని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల సమయంలోనే దిల్లీ వాళ్ల చేతిలో పాలన పెట్టవద్దని కేసీఆర్ సూచించినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ లు దిల్లీకి గులాములుగా మారిపోయాయని అన్నారు. సీఎం రేవంత్ 73సార్లు దిల్లీకి వెళ్లి.. 70పైసలు కూడా తీసుకొని రాలేదన్నారు.

Also Read: ‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!

Advertisement

గత పదేండ్ల పాలనలో కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అంగీకరించారు. వచ్చే ఐదు సంవత్సరాలు.. కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ మరో 25 ఏండ్లు నిలబడాలంటే కార్యకర్తలే బలమని అన్నారు. వారి కోసం ఎంత చేసినా తక్కువనే అని కేటీఆర్ పేర్కొన్నారు. తమ కార్యకర్తలను వేధిస్తున్న ముఖ్యమంత్రికి, ఆయన అనుచర బృందానికి సినిమా చూపించే బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ అన్నారు.

Also Read: ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×