E-Paper
Advertisement

దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
Advertisement

Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి నాకు మద్య గ్యాబ్ ఉందంటూ కొంతమంది వ్యక్తులు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నార పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవి వాస్తవాలు కావని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రే అని, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలు కో ఆర్డినేషన్ కమిటీలో చర్చిస్తే బాగుంటుందని అనుకున్నామని అన్నారు. అందరం చర్చిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలమని అనుకున్నామని, కో ఆర్డినేషన్ కమిటీకి అన్ని చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదని మేం ముఖ్యమంత్రిని గౌరవిస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు.

మా మధ్య ఏం లేదు..

పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదు. రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాకు, సీఎంకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఆయన అన్నారు. సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటామని, నిన్న కూడా సీఎంతో ఫోన్ మాట్లాడానని అన్నారు. నా ఆడియోలు వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట పెట్టండి అంటూ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. సీఎంకు, నాకు మంచి సఖ్యత ఉందని, దొంగ చాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. ఏమున్నా మేం మొహంపైనే మాట్లాడుకుంటామని, బయట జరుగుతున్న విషయాలను చర్చించుకుంటామని అన్నారు. కో ఆర్డినేషన్ కమిటీలో కీలక చర్చ జరిగింది. అందరం ఓపెన్ గానే మాట్లాడుకున్నాం అని అన్నారు.

Advertisement

Also Read: లీకులు ఫుల్.. అప్‌డేట్ నిల్.. ఇదేం గేమ్ జక్కన్నా?

హరీష్ రావు పై సెటైర్లు..

కో ఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం మీరు ఫోటోలో చూస్తే వంశీ మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తోందని, ప్రోటోకాల్ ప్రకారం మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించారని తెలిపారు. టేబుల్ ఓవెల్ షేప్‌‌లో ఉంది కాబట్టి అందరూ పొరబడుతున్నారని తెలిపారు. లీగల్ నోటీసులకు భయపడం నేను హరీష్ రావుపై అబద్ధాలు చెప్పలేదు. ఏమైనా ఉంటే న్యాయ స్థానంలో కొట్లాడుతామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అరవింద్ మాటలు నీటి మూటలు నా ముందు అరవింద్, సంజయ్ పిల్లలు, లాల్ బహదూర్ శాస్త్రి కూడా హైట్ తక్కువే. దేశాన్ని ఏలలేదా? అని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×