E-Paper
Advertisement

మేడ్చల్‌లో ఉద్యమ యోధులకు ఘన నివాళులు.. ఒక్కటైన కీలక నేతలు!

మేడ్చల్‌లో ఉద్యమ యోధులకు ఘన నివాళులు.. ఒక్కటైన కీలక నేతలు!
Advertisement

Telangana Tribute: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ మలి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విశేష పాత్ర పోషించిన ఉద్యమ యోధులకు గురువారం మేడ్చల్‌లో ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి, ఇటీవల కన్నుమూసిన నర్సంపల్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మరణార్థం పార్టీలకతీతంగా నాయకులు, స్థానికులు నివాళులర్పించారు.

తెలంగాణ వాదం..

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంత బలం అందించగా, గద్దర్ తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాదాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అందించిన మద్దతు చిరస్మరణీయమని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమకారుల త్యాగాలు, నేతల చిత్తశుద్ధి ఫలితమని, తెలంగాణ మలి ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటంతో సమానమని అభివర్ణించారు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!

పాల్గోన్న ముఖ్యనాయకులు..

ఈ కార్యక్రమంలో టీ పి పి సి ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి,జిల్లా ఉప అధ్యక్షుడు బాల్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, విగ్రహ కమిటీ సభ్యులు సత్యపాల్ రెడ్డి,ప్రవీణ్, భద్ర రెడ్డి,కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, చాప రాజు, నాయకుల రాఘవేందర్ గౌడ్,నవీన్ రెడ్డి,దేవా, రవీందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,రమేష్, బి పి టి రాజు,జగన్ రెడ్డి, కౌడె మహేష్ , కరెంట్ శంకర్ , సంతోష్ గౌడ్,సాయి,మురళి ,రాజిరెడ్డి , రమేష్ సంజీవరావు,రేగు రాజు,రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: వైజాగ్ లో బన్నీ AAA సినిమాస్ ఓపెనింగ్…. కానీ ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×