Big Stories

CM Revanth Reddy: కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech In Nirmal Public Meeting: కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు కానట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు.

- Advertisement -

గత 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.

- Advertisement -

ఆదిలాబాద్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని తెలిపారు. నిర్మల్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. ఆదిలాబాద్ లో మూతబడిన పరిశ్రమలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు.

Also Read: కవిత ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..? : తమిళి సై

ఈనెల 9 లోపు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు.

ఇక కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News