E-Paper
Advertisement

KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో ఆయన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయని గులాబీ పార్టీలోనే ఓ వర్గం నేతలు పెద్దఎత్తున చర్చిస్తున్నట్లు టాక్. ఆ టైంలో ఆయన ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదని, సీనియర్ల సలహాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించినట్లు గతంలోనే చాలా మంది మాట్లాడారు. అయితే, ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కటిగా కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఇదిలాఉండగా, యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత ఇటీవల హైదరాబాద్‌కు రాగా ఆయనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజకీయాల్లో అఖిలేశ్ యాదవే తమకు స్ఫూర్తి అని అన్నారు.ఆయనతో దోస్తీ కోసం కేటీఆర్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తున్నది. ఇంతకూ కేటీఆర్ మదిలో ఏముంది? ఆయనతో దోస్తీ ఆయనకు ఏవిధంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు?

వెంటాడుతున్న ఫార్ములా ఈ కార్ కేసు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో గోల్‌మాల్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంపై దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి.ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచాణలో భాగంగా దర్యాప్తు అధికారులకు.. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండీఏ నిధులు రూ. 50కోట్లు విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు.దీంతో కేటీఆర్‌ను సైతం దర్యాప్తు అధికారులు విచారించారు. ఆయన కూడా దీనిని అంగీకరించారు.అదో లొట్టపీసు కేసు అని అరెస్టు చేస్తే చేసుకోండని గాంభీర్యం ప్రదర్శించారు.

అరెస్టు నుంచి తప్పించుకునేందుకేనా?

Advertisement

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన పార్టీకి అత్యధిక ఎంపీలు పార్లమెంటులో ఉన్నారు.ఆయన చెబితే కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలు వినే ఆస్కారం ఉంది. జాతీయ కాంగ్రెస్ సైతం ఆయన మాటకు విలువనిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది.నిజంగానే ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఆయన్ను అరెస్టు చేయడానికి సర్కారు రంగం సిద్ధం చేస్తే.. అఖిలేశ్ యాదవ్‌తో ఒక్క మాట చెప్పించినా జాతీయ కాంగ్రెస్ వింటుంది. అక్కడి నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఒక్క కాల్ వస్తే తన అరెస్టు ఆగుతుందని ముందే ఊహించి కేటీఆర్ ఇలా ఆయనతో మైత్రిని పెంచుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేసీఆర్ ప్లానేనా?

అఖిలేశ్ యాదవ్ రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన యాదవుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.ముందుగా సీఎం రేవంత్ తో భేటీ అనంతరం కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. ఆయన కేటీఆర్‌‌తో సమావేశం వెనుక మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఏమైనా ఉందా? ఆయనచొరవతోనే కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారా? అనే చర్చ జరుగుతోంది.దీనివెనుక ఇండియా కూటమికి గులాబీ పార్టీ ఏమైనా దగ్గరవుతుందా? అనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టొచ్చని గులాబీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు టాక్.

Advertisement

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×