E-Paper
Advertisement

GHMC Ward Delimitation: ప్రజల కోసమే వార్డుల పునర్విభజన.. పాలన వికేంద్రీకరణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

GHMC Ward Delimitation: ప్రజల కోసమే వార్డుల పునర్విభజన.. పాలన వికేంద్రీకరణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

GHMC Ward Delimitation: హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) ప్రక్రియను చేపట్టామని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండేలా, పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతోందని, దీనివల్ల నగరంలోని ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగి, కార్పొరేటర్లు ప్రజా సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారని మంత్రి తెలిపారు.

ముఖ్యంగా జీహెచ్ఎంసీలో విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ఈ డీలిమిటేషన్ దోహదపడుతుందన్నారు. ప్రతి వార్డుకు జనాభా, అవసరాల ఆధారంగా నిధుల కేటాయింపు సులభతరమవుతుందని, గతంలో ఉన్న ఓటర్ల జాబితా లోపాలను సరిదిద్ది, సాంకేతికంగా పారదర్శకతను పాటిస్తున్నామని వెల్లడించారు. నీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పన ప్రణాళికాబద్ధంగా సాగుతుందని చెప్పారు. వార్డుల విస్తీర్ణం, పరిమాణం తగ్గడం వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువవుతారని, స్మార్ట్ సిటీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ కారిడార్ల వంటి ప్రాజెక్టుల అమలుకు ఈ డీలిమిటేషన్ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు.

Advertisement

కాగా, ఈ నెల 14న డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిన్నటి వరకు ప్రజల నుంచి 1328 అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఈ రోజు, రేపు కూడా పౌరులు తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లేదా ఆయా జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో లిఖితపూర్వకంగా తెలపవచ్చని పొన్నం ప్రభాకర్ సూచించారు.

Read Also: CM Revanth : 5 నిమిషాల మ్యాచ్‌పై ఇంత రచ్చనా? రేవంత్‌కు క్రెడిట్ వస్తుందనేనా?

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×