Erravelli Tension:తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై mlc తాతామధు చేసిన కామెంట్స్ ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.దళిత నేత అయిన గడ్డం ప్రసాద్ పై చెప్పలేని విధంగా తాతామధు బూతులతో దాడి చేశాడని ఫలితంగా ఎర్రవల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద వెయ్యి డప్పులతో చావు డప్పు మోగిస్తామని ప్రకటించారు కూడా.దీనికి కౌంటర్ గా బీఆర్ ఎస్ నాయకులు కూడా రైతు దీక్ష చేస్తామని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా గజ్వేల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెద్ద సంఖ్యలో ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు
ఇక తాజాగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు రెడీ అయ్యారు.వీరిలో సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ mla నర్సారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చావు డప్పు మొగించడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ ని ముట్టడించడానికి ప్రయత్నించారు.అయితే ఫామ్ హౌస్ ని ముట్టడించడానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులని వరదరాజపురంలో పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోలీసులకి, కాంగ్రెస్ శ్రేణులకి మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు కేసీఆర్‌పై దాడి చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.పోలీసుల వల్ల ఏమీ కాదు,మా నాయకుడిని మేమే కాపాడుకుంటాం అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఎర్రవల్లి చేరుకోగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా బయలుదేరారు.
అయితే శాంతిభద్రతల సమస్య కారణంగా పోలీసులు వాహనాలను ముందుకు పోనివ్వకపోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపు కాలినడకన పాదయాత్రగా బయలుదేరినట్టు తెలుస్తుంది.
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
ఇక 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్ వైపు ఎలా వెళ్లగలిగారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఎర్రవల్లి వద్దకు ఎవరూ వెళ్ళకూడదు అంటూనే మరోవైపు అధికార పార్టీ నేతలకు అవకాశం ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి బీఆర్ యస్ శ్రేణులు.ఇక ఇష్యూ కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు ఎర్రవల్లిలో ఏం జరుగుతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ప్రజలు.
మరో వైపు మర్కూక్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో పోలీసులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వైపు ఎవరూ వెళ్ళకుండా అన్ని దారులని మూసి వేసినట్టు తెలుస్తుంది.
ఇంకెన్ని మంటలు పుట్టిస్తాయో !
అయితే తమని మాత్రమే ఆపి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి ఎర్రవల్లి వైపు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారని బీ ఆర్ యస్ శ్రేణులు చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.చూడాలి మరి mlc తాతామధు చేసిన కామెంట్స్ ముందు ముందు ఇంకెన్ని మంటలు పుట్టిస్తాయో !