Lady Aghori: రెండు తెలుగు రాష్ట్రాలలో అఘోరీ మాత క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆలయాల సందర్శనతో బిజిబిజీగా ఉన్న అఘోరీ మాత, ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా వెళుతున్నారు. ఇంతకు ఏ ఓపెనింగ్ కి వెళ్ళారు.. అసలు అక్కడ ఎవరు కలిశారో తెలిస్తే షాక్ కావాల్సిందే.
తెలంగాణకు చెందిన అఘోరీ మాత తెలియని వారు ఉంటారా.. అస్సలు ఉండరు కూడా. ఎందుకో తెలుసా ఈమె క్రేజ్ అటువంటిది. అతి తక్కువ కాలంలో సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం పొందిన అఘోరీ మాత, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారారు. కార్తీక మాసం ప్రారంభ సమయంలో శ్రీకాళహస్తి ఆలయ సందర్శనకు వెళ్లిన సమయంలో ఆత్మార్పణకు ప్రయత్నించి సంచలనం కలిగించారు. మళ్లీ కారు ప్రమాదంతో కాలినడకన యాగంటి, ఇలా క్షేత్రాలను ఆమె దర్శించారు.
ఇటీవల హైదరాబాద్ పర్యటన సమయంలో మహిళ పై అఘాయిత్యాలకు పాల్పడ్డ ఓ వ్యక్తిని పది మందిలో అవమానించబోతున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగక వేములవాడ శ్రీ రాజన్న ఆలయంలో గల దర్గాను తానే స్వయంగా తొలగిస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్ తో ఉండే అఘోరీ మాత, ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా హాజరవుతున్నారు.
తాజాగా ఖమ్మం జిల్లా మధిర లో పర్యటించిన అఘోరీ మాత, ఓ ప్రైవేటు వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఘోరీ మాతకు వైద్యశాల యాజమాన్యం, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని మర్యాదపూర్వకంగా అఘోరిమాతను కలిశారు.
అలాగే అఘోరి మాతకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. మొన్నటి వరకు ఆలయాల సందర్శనలో ఉన్న అఘోరీ మాత, ప్రస్తుతం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం, అక్కడ ఏకంగా డిప్యూటీ సీఎం సతీమణి ఆశీర్వచనం తీసుకోవడం వైరల్ గా మారింది.