Nayan Vs Dhanush:మమత మోహన్ దాస్ (Mamta Mohan Das).. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన యమదొంగ (Yamadonga )సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కానీ వార్తల్లో మాత్రం అప్పుడప్పుడు నిలుస్తోంది అని చెప్పవచ్చు. గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఈమె, ఆ తర్వాత బొల్లి వ్యాధి సోకినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
నయనతార వల్లే నా షాట్స్ తీసేశారు..
అయితే నయనతార (Nayanatara) పై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార పై మమతా మోహన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నయనతార చేసిన పనికి తాను ఎంతో బాధపడ్డానని తెలిపింది. అయితే నయనతార ఏం చేసింది..? మమతా మోహన్ దాస్ ఎందుకు హర్ట్ అయింది? అనే విషయాలు మమత స్వయంగా వెల్లడించింది. ఇక మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. “రజనీకాంత్ (Rajinikanth ) హీరోగా నటించిన ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో ఒక పాట కోసం సినిమా బృందం నన్ను సంప్రదించింది. అయితే ఆ ఒక్క పాటను మేము ఏకంగా నాలుగు రోజులు షూట్ చేశాము. అయితే ఆ షూట్ చేస్తున్నప్పుడే ఆ సినిమా పాటలో నేను లేనని నాకర్థమైంది. ఇక ఫైనల్ కాపీ బయటకు వచ్చిన తర్వాత అందులో నా షాట్స్ లేవు. అయితే ఒక్క షాట్ లో నేను కనిపించినా.. నాకు చెప్పిన విధంగా ఆ పాటను అక్కడ చిత్రీకరించలేదు. అయితే చిత్ర బృందం ఒక హీరోయిన్ చెప్పినట్టే విన్నది అనే విషయం నాకు చివరిగా తెలిసి, ఎంతో బాధపడ్డాను. ఆ పాటలో మరో హీరోయిన్ ఉందని తనకు చెప్పలేదని, అందుకే తాను షూటింగ్ కి రానని నయనతార చెప్పిందట. అందుకే నయనతార కోసం నా పార్ట్ ని చిత్రీకరించలేదు. అంతేకాదు ఈ సినిమా కోసం నేను నాలుగు రోజుల కష్టాన్ని వృధా చేసుకోవడంతో ఆ బాధ మరింత ఎక్కువైంది” అంటూ తెలిపింది.
కథానాయకుడు సినిమాలో..
అసలు విషయంలోకి వెళితే.. రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘కథానాయకుడు’. 2008లో విడుదలైన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలోని “దేవుడే స్వర్గం నుంచి” అనే పాటలో మమత కనిపించింది.
డాక్యుమెంటరీ విషయంలో నయనతార – ధనుష్ మధ్య గొడవ..
ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అటు ధనుష్ ఇటు నయనతార మధ్య తార గొడవ తార స్థాయికి చేరడం వల్లే.. గతంలో మమతా మోహన్ దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. మరోపక్క ధనుష్ కి వ్యతిరేకంగా ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ నయనతారకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, పార్వతి, ఐశ్వర్య లక్ష్మితోపాటు పలువురు హీరోయిన్స్ నయనతారకు అండగా నిలిచారు. మరి ఏది ఏమైనా ధనుష్ వర్సెస్ నయనతార వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.