Group 3 Exam:ఈమధ్య కాలంలో జనరల్ నాలెడ్జ్ అంటే చారిత్రక అంశాలతో పాటు సినిమా నాలెడ్జ్ కూడా ఉండాలి అనేది అందరి వాదన. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి మెయిన్ ఎగ్జామ్స్ లో కూడా సినిమాలపై ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఇక అన్ని రంగాలపై అవగాహన ఉండాలి అనేది తప్పనిసరి అయిపోయింది. ఇకపోతే ఇప్పటికే పెద్ద పెద్ద సినిమా హీరోలు, హీరోయిన్ల బయోపిక్ లు కూడా ఇతర భాష పాఠ్య పుస్తకాలలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో గ్రూప్ -3 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయం 10:00 గంటల మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ -1 పరీక్ష పూర్తి అయింది. అలాగే మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష ఉంటుంది. అలాగే రేపు ఉదయం, మధ్యాహ్నం కూడా గ్రూప్ -3 పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది.మొత్తం 1,365 పోస్టులకు గానూ 5.36లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. కాగా పేపర్ వన్ ప్రశ్నాపత్రంలో సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి గ్రూప్ -3 పేపర్ వన్ క్వశ్చన్ పేపర్లో అడిగిన ప్రశ్నలు ఏంటి? అసలు వాటికి సమాధానాలు మీకు తెలుసో..? లేదో.? ఇప్పుడు చూద్దాం.
గ్రూప్ 3 ఎగ్జామ్ లో సినిమాలపై ప్రశ్న..
1.2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందిన ఏది?
A). బ్రహ్మాస్త్ర
B). కాంతారా
C). ముర్ ముర్స్ ఆఫ్ ది జంగిల్
D). ఆట్టం
2. ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఏ టైగర్ దర్శకుడు ఎవరు?
A). కార్తికి గొన్సాల్వ్స్
B). నిషా పహుజా
C). ఆర్. మహదేవన్
D). నిఖిల్ మహాజన్
ఇలా ఈ రెండు ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వచ్చాయి. మరి వీటికి ఆన్సర్స్ మీకు తెలుసా..?
మొదటి ప్రశ్నకు సమాధానం ఆట్టం. ఈ సినిమా 2024 లో విడుదలైనప్పటికీ.. 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఇక రెండో ప్రశ్న జవాబు నిషా పహుజా.. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసు పై ఈ సినిమాను తెరకెక్కించారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయింది.
సినిమా నాలెడ్జ్ తప్పనిసరి..
ఇక ఇలా సినిమాకు సంబంధించి ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే సినిమా నాలెడ్జ్ ఉన్నవారు సులభంగానే ఆన్సర్ అటెంప్ట్ చేసినా . ఆన్సర్ తెలియని వారు సమాధానాలు పెట్టలేదు అన్నట్లు అభ్యర్థులు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సినిమా రంగం అనేది వినోదానికే కాదు నాలెడ్జ్ కి కూడా ప్రతీకగా నిలిచింది. ఎంతోమంది ప్రతిభావంతులు ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని ఆస్కార్ అవార్డులను అందుకుంటున్నారు. అందుకే సినిమా రంగంపై కూడా అవగాహన పెంచుకోవాలని అభ్యర్థులు తెలియజేస్తున్నారు.