Lagacharla Case: లగచర్ల దాడి కేసులో ప్రధాన నింధితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ ఓ లాయర్ ను తీసుకుని వచ్చి కొడంగల్ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో సురేష్ కు కొడంగల్ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. జ్యుడిషయల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సురేష్ ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా చేర్చిన పోలీసులు సురేష్ ను ఏ2గా చేర్చారు.
విచారణ తరవాత సురేష్ ను దాచిపెట్టింది ఎవరు? ఇన్ని రోజులు ఎక్కడ దాచారు? ఎందుకు దాచారు? అనే వివరాలు బయటకు రానున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సురేష్ పోలీసుల నుండి తప్పించుకుని ఇన్నిరోజులు తిరగడం అనేది హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు వస్తున్నారే సమాచారంతో సురేష్ ప్రతిసారి ఉన్నచోటు నుండి మకాం మరోచోటుకు మార్చేశాడు. కాబట్టి దాడి వెనక, మరియు సురేష్ పోలీసులకు కనిపించకుండా దాచి పెట్టడం వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలోని పలువురు వ్యక్తులు సహకరించినట్టు వార్తలు వస్తున్నాయి. కేసులో దాదాపు ప్రతిఒక్కరూ అరెస్ట్ అయినా ప్రధాన నిందితుడు ఎలా తప్పంచుకున్నాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సురేష్ కు సహకరించిన వారిపై కూడా కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడిని కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.