BigTV English

Warangal Cricket Stadium : వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… స్పోర్ట్స్‌ స్కూల్ కి గ్రీన్ సిగ్నల్

Warangal Cricket Stadium : వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… స్పోర్ట్స్‌ స్కూల్ కి  గ్రీన్ సిగ్నల్

Warangal Cricket Stadium :   సాధారణంగా క్రీడా రంగంలో వరంగల్ జిల్లాకు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు.. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కూడా పచ్చజెండా ఊపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈ శుభవార్త చెప్పారు. స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసి.. 10 రోజుల్లో జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.


Also Read : IND Vs ENG :  టీమిండియాను ఓడించే ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడుగా..!

 రాష్ట్రానికి రెండో రాజధానివరంగల్


హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ తదితర పథకాల కోసం ఇప్పటికే సుమారు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం. తాజాగా ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేలు క్రికెట్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ కావాలని కోరడంతో గ్రిన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ తదితర పథకాల కోసం ఇప్పటికే సుమారు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం. తాజాగా ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేలు క్రికెట్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ కావాలని కోరడంతో గ్రిన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

30 ఎకరాలు స్టేడియం.. 20 ఎకరాలు అకాడమీ.. 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ఉనికిచర్ల సమీపంలోని 50 ఎకరాలు అనువుగా ఉంటుందని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు వివరించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ అకాడమీ నిర్మించనున్నారు. ఇందులో 30 ఎకరాల స్టేడియం, 20 ఎకరాలు అకాడమీ కోసం కేటాయించనున్నారు.   ఉమ్మడి వరంగల్‌ నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడా దిగ్గజాలు ఉన్నారని, అందులో ద్రోణాచార్య, అర్జున అవార్డులు అందుకున్న వారు ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హనుమకొండలో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉంది. ఇక్కడ అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వివరించారు. వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌, క్రికెట్‌ స్టేడియం నగరానికి మణిహారంగా నిలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు తెలిపారు. ఎమ్మెల్యేల వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు స్పోర్ట్స్‌ స్కూల్‌, స్టేడియం నిర్మాణాలకు కావాల్సిన ప్రతిపాదనలు పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సంబంధిత శాఖ సెక్రటరీకి ఫోన్‌ చేసి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×