BigTV English

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

lifting of osmansagar and himayatsagar gates: నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా ఉస్మాన్ సాగర్ 2 గేట్లను అడుగుమేర ఎత్తి 226 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787.95 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ ఒక గేటు అడుగు మేర ఎత్తి 340 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులకు చేరింది. వరద నీరు విడుదల చేస్తుండడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతోపాటు జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర సంబంధిత అధికారులను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు.


Also Read: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే


Tags

Related News

Dhulpet Ganja Seized: దూల్‌పేటలో 8.2‌ కేజీల గంజాయి పట్టివేత

Rajaiah vs Kadiyam: ఎమ్మెల్యే కడియంపై మరోసారి రెచ్చిపోయిన రాజయ్య..

CM Revanth Reddy: అలయ్ బలయ్ కార్యక్రమానికి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Honey Trap: హనీట్రాప్‌లో యోగా గురువు.. ఇద్దరు మహిళలతో వల, చివరకు ఏమైంది?

GHMC Rules: రోడ్డుపై చెత్త వేస్తే జైలు శిక్ష..హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్

Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

Telangana Politics: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Big Stories

×