BigTV English

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

జయభేరికి నోటీసులు


– నగరంలో హైడ్రా దూకుడు
– మరో నటుడి కట్టడాలపై ఫోకస్
– మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు
– రంగలాల్ కుంట ఆక్రమణల నేపథ్యంలో చర్యలు
– వెంటనే తొలగించాలని నోటీసుల్లో స్పష్టం

HYDRA Notices: చెరువులు, నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముందుగా నోటీసులు పంపుతున్న అధికారులు, ఆక్రమణలను తొలగించకపోతే కూల్చివేతకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు అందాయి.


వాటిని తొలగించాల్సిందే!

గండిపేట చెరువుకు దగ్గరలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్ కుంట ఉంటుంది. ఇది ఒకప్పుడు పెద్దదిగా ఉండేది. ఏళ్లు గడిచే కొద్దీ కుచించుకుపోయింది. జయభేరి సంస్థ రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టిందని గుర్తించిన అధికారులు, వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. లేకపోతే, కూల్చివేతలు జరుగుతాయని హెచ్చరించారు.

భగీరథమ్మ చెరువు పరిశీలించిన రంగనాథ్

నగరంలోని చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వరుస పర్యటనలు చేస్తూ, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలోనే భగీరథమ్మ చెరువును పరిశీలించారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్ పరిధిలో నిర్మాణ వ్యర్ధాలను వేయడం గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు రంగనాథ్. 15 రోజుల్లో సమావేశాన్ని నిర్వహిస్తామని, అప్పటిలోగా రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Also Read: Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

ఎన్ కన్వెన్షన్ మాదిరి కూల్చివేతలుంటాయా?

కొద్ది రోజుల క్రితం మాదాపూర్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అదంతా అక్రమ కట్టడమని, చెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణం జరిగిందని నేలమట్టం చేశారు. ఇప్పుడు మరో నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థ రంగలాల్ చెరువు పరిధిలో నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించిన అధికారులు ఎన్ కన్వెన్షన్ మాదిరి కూల్చివేస్తారా? అనే చర్చ జరుగుతోంది.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×