BigTV English

Lizard In Biryani : బాబోయ్ బిర్యానీలో బల్లి.. 8 మందికి అస్వస్థత

Lizard In Biryani : బాబోయ్ బిర్యానీలో బల్లి.. 8 మందికి అస్వస్థత
hyderabad latest news

Lizard In Biryani(Hyderabad latest news) :

బిర్యానీ అనగానే గుర్తొచ్చేది మన హైదరాబాద్. ఇక్కడి దమ్ బిర్యానీ అంత ఫేమస్. వరల్డ్ ఫేమస్ అయిన హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కాలం నుంచీ ఉంది. హైదరాబాద్ బిర్యానీ అంటే నగర ప్రజలకు ఓ ఎమోషన్. ప్రపంచ ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో మన హైదరాబాద్ బిర్యానీ స్థానం సంపాదించుకుంది.


ఇక హైదరాబాద్‌లో గల్లీకో బిర్యానీ సెంటర్ ఉంటుంది. భోజన ప్రియులు తమకు నచ్చిన చోటుకి వెళ్లి బిర్యానీని లాగిస్తుంటారు. కొన్ని సార్లు హోటల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆహరంలో బల్లులు, బొద్దింకలు ఇలాంటివి వస్తుంటాయి.అవి తెలియకుండా తినే వారు అస్వస్థతకు గురవుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న ఎలైట్ హోటల్ లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది మంది ఆ హోటల్‌లో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఆకలిగా ఉన్న వారంతా బిర్యానీ రాగానే ఫాస్ట్‌గా తినేశారు. కానీ చివరలో తమ ప్లేట్లలో ఒక చిన్న తోక వంటిది కనిపించింది. పరిశీలించి చుడాగా ఆ బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా వరందరు షాక్‌కి గురయ్యారు.


వారిలో కొందరు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. వెంటనే బాధితులను అత్తపూర్‌లోని జాయ్ అసుపత్రికి తరలించారు. ఎలైట్ హోటల్ యజమాని పై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ లోని చాలా హోటల్స్ లో పరిస్థితి దీనంగా ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×