BigTV English

Hanuman: ‘హనుమాన్’ మూవీ హీరోపై బాలీవుడ్ ట్రోలింగ్..!

Hanuman: ‘హనుమాన్’ మూవీ హీరోపై బాలీవుడ్ ట్రోలింగ్..!

Hanuman: ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘హనుమాన్’ ఒకటి. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. అంతేగాక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగు కంటే హిందీ వెర్షన్‌కే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.


అయితే మరి ఇంత భారీ బజ్ ఉన్న సినిమాపై బాలీవుడ్ విషం చిమ్మడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అనుకోకుండా బాలీవుడ్ సోషల్ మీడియాలో హనుమాన్ మూవీపై ట్రోలింగ్ మొదలైంది. ఇదివరకు ట్రైలర్‌లో విఎఫ్ఎక్స్ బాగాలేవని ట్రోల్ చేసిన బాలీవుడ్ వర్గాలు.. ఇప్పుడు హీరో తేజా సజ్జపై ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన చిత్రబృందం సినిమాకి మాత్రం పెద్ద హీరోని తెచ్చుకోలేకపోయారు. ఒక చిన్న పిల్లాడిలా ఉన్న వాడిని హీరో చేశారంటూ తేజా సజ్జపై నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

అయితే సౌత్ సినిమాలు బాలీవుడ్‌ని అన్ని రకాలుగా దాటేశాయన్న ఈర్ష్య కొంతమంది బాలీవుడ్ వర్గాల్లో ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక నోరుజారిన వాళ్లే ముక్కున వేలేసుకుంటారని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయంపై ఎవరైనా స్పందిస్తారా? లేదా అనేది చూడాలి. ఇకపోతే క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×