E-Paper
Advertisement

Kothagudem : భర్తను కొట్టి.. వివాహిత కిడ్నాప్.. వీడియో వైరల్..

Kothagudem : భర్తను కొట్టి.. వివాహిత కిడ్నాప్.. వీడియో వైరల్..
Advertisement
Kothagudem

Kothagudem : కొత్తగూడెంలోని హౌజింగ్‌ బోర్డు. పట్టపగలు.. పట్టణం నడి మధ్యలో.. అందరూ చూస్తుండగానే దారుణ ఘటన జరిగింది. కారులో వెళ్తున్న ఓ యువ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు విరుచుకుపడ్డారు. భర్తను చితకబాది.. భార్యను కిడ్నాప్‌ చేశారు. ఘటనలో బయటపడ్డ షాకింగ్‌ నిజం అందరినీ విస్తుగొలుపుతోంది. ఆ యువతి తల్లిదండ్రులే కిడ్నాప్‌ చేయించినట్టు తెలుస్తోంది. కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

Advertisement

ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి.. ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కొత్త జంట ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. గురువారం కొత్తగూడెంలోని కాలేజీలో పరీక్ష రాసేందుకు సన్నీతో కలసి మాధవి కారులో వచ్చింది. కారు హౌజింగ్‌ బోర్డు వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చారు. ఆటో అడ్డుపెట్టి కారును ఆపారు. సన్నీని చితకబాది.. మాధవిని కిడ్నాప్‌ చేశారు.

దాడి, కిడ్నాప్‌ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఘటన జరిగిన తీరు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. సన్నీ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నామని.. ప్రేమ, పెళ్లి కోణంలోనే ఎంక్వయిరీ చేస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×