BigTV English

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించిన ఆకతాయిలు.. అక్కడ తాకేందుకు ప్రయత్నం..

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించిన ఆకతాయిలు.. అక్కడ తాకేందుకు ప్రయత్నం..

Hooligans in Madhapur: నగరంలో యువతుల భద్రత మళ్లీ ప్రశ్నార్థకమైంది. రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే అమ్మాయిలను ఆకతాయిలు వెంబడించి, వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.


జరిగింది ఇదే..

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు బైక్ పై వెళ్తున్నారు. వారి వెనుక స్కూటీపై ముగ్గరు యువకులు వెంబడిస్తూ ముందకు వెళ్లారు. బైక్ పై వెళ్తున్నారు అమ్మాలను చూసి అసభ్య కామెంట్లు చేయడమే కాకుండా వారిని తాకేందుకు ప్రవర్తించారు. దాంతో యువకులు ప్రవర్తనను చూసి భయాందోళనలైన ఆ అమ్మాయిలు ఏమీ చేయలేక, మౌనంగా ముందుకు వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను వెనుక నుంచి వస్తున్న ఓ కారులోని వ్యక్తులు తమ కెమెరాలో రికార్డ్ చేశారు.


Also Read:Peddi Movie: రామ్ చరణ్ పెద్ది నుంచి బిగ్ అప్డేట్… స్పెషల్ వీడియో వదిలిన టీమ్!

పరారైన ఆకతాయిలు

కారులోని వ్యక్తి వీడియో తీస్తున్నారని గమనించిన యువకులు వీడియో ఎందుకు తీస్తున్నావ్? అంటూ బెదిరించారు. వారి మాటలను పట్టించుకోకుండా కారులోని వ్యక్తి వీడియో తీయడంతో భయంతో బైక్ స్పీడ్ పెంచి యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో ఎక్స్‌లో వైరల్ కావడంతో మాదాపూర్ పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు మైనర్లుగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఒకటీ రెండు కాదు, వరుసగా జరుగుతునే ఉన్నాయి. పోలీసుల నిఘా ఎక్కడ? భద్రతా హామీలు ఏమయ్యాయి? అన్న ప్రశ్నలు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ రహదారులపైనే యువతులు ఇలా వేధింపులకు గురవుతుంటే భవిష్యత్తులో పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన నగరంలో నెలకొంది.

Related News

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Kamareddy floods: కామారెడ్డిలో వర్షాల బీభత్సం.. 60 మందిని రక్షించిన రియల్ హీరోస్!

Big Stories

×