E-Paper
Advertisement

అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం
Advertisement

Mahabubabad: కుటుంబ కలహాలు, క్షణికావేశం ఓ అభం శుభం తెలియని పసికందు ప్రాణాలను బలిగొన్నాయి. అత్తతో జరిగిన చిన్నపాటి గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి, కన్నకూతురినే కడతేర్చి తానూ తనువు చాలించాలనుకుంది. మహబూబాబాద్ జిల్లా భోజ్యతండాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?

Advertisement

భోజ్యతండాకు చెందిన బానోత్ బన్సీలాల్‌కు, సుప్రజతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల కుమార్తె త్రిష ఉంది. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ఇటీవల చిన్నపాటి మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రజకు తన అత్త బాలితో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి, మనస్తాపానికి లోనైన సుప్రజ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దారుణానికి ఒడిగట్టింది. కన్నబిడ్డ అని కూడా చూడకుండా 8 నెలల చిన్నారి త్రిష గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హతమార్చింది.

ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

Advertisement

బిడ్డ ప్రాణాలు తీసిన తర్వాత తానూ బతకకూడదనే ఉద్దేశంతో సుప్రజ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నం విఫలం కావడంతో వెంటనే బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ తాగింది. కొద్దిసేపటికి ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుప్రజను, విగతజీవిగా మారిన చిన్నారిని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని సుప్రజను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?

Tags

Related News

స్ట్రాటజీనా..? అలకనా..? కొండా సురేఖ మౌనంపై కాంగ్రెస్‌లో చర్చ

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?

సిద్దిపేట నీ జాగీరా హరీష్ రావు?.. బరాబర్ వస్తాం, అడ్డుకో చూస్తాం – భవానీ రెడ్డి సవాల్

హామీలు నెరవేర్చకుంటే ఉద్యమమే.. రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

తెలంగాణలో ఆల్-టైమ్ రికార్డు విద్యుత్ డిమాండ్.. రబీ సీజన్‌పై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

భద్రాచలంలో దారుణమైన ఘటన.. అర్ధరాత్రి యువకుడ్ని కొట్టి, సీసీటీవీ సాక్షిగా

మాజీ డీజీపీకే దిమ్మతిరిగే షాక్.. రూ.18 కోట్ల భూమిని మాయం చేసిన రియల్టర్లు!

Big Stories

Advertisement
×