E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?
Advertisement

Bharat Summit: స్వేచ్ఛ బ్యూరో: భారత్ సమ్మిట్ వేదికగా చోటుచేసుకున్న రాజకీయ వ్యాఖ్యల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు అమిత్ షా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సమ్మిట్‌లో ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆరా తీసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విదేశీయుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం. సంబంధిత వ్యక్తులపై విమానాశ్రయ అధికారులతో పాటు అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఫిర్యాదులు చేయాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యల విషయంలో చట్టపరమైన మార్గాల్లో స్పందించాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

బీజేపీ పార్టీ వర్గాల్లో చర్చ..

Advertisement

భారత్ సమ్మిట్ అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పార్టీ నాయకులు స్పందిస్తున్న తీరుపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో ప్రజా క్షేత్రంలో పోరాటాలను కొనసాగించాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఇటలీకి చెందిన రాజకీయ నాయకుడు గీయాకోమో ఫిలిబెక్ చేసిన ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ వివాదంపై బీజేపీ నేతలు సకాలంలో కౌంటర్ ఇవ్వలేదని అమిత్ షా అసహనం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత్ సమ్మిట్ వ్యాఖ్యల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తుండగా, బీజేపీ నాయకత్వం ఈ అంశాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: సిద్దిపేట నీ జాగీరా హరీష్ రావు?.. బరాబర్ వస్తాం, అడ్డుకో చూస్తాం – భవానీ రెడ్డి సవాల్

Tags

Related News

సిద్దిపేట నీ జాగీరా హరీష్ రావు?.. బరాబర్ వస్తాం, అడ్డుకో చూస్తాం – భవానీ రెడ్డి సవాల్

హామీలు నెరవేర్చకుంటే ఉద్యమమే.. రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

తెలంగాణలో ఆల్-టైమ్ రికార్డు విద్యుత్ డిమాండ్.. రబీ సీజన్‌పై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

భద్రాచలంలో దారుణమైన ఘటన.. అర్ధరాత్రి యువకుడ్ని కొట్టి, సీసీటీవీ సాక్షిగా

మాజీ డీజీపీకే దిమ్మతిరిగే షాక్.. రూ.18 కోట్ల భూమిని మాయం చేసిన రియల్టర్లు!

రూమ్‌మేట్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి.. ఘాతుకానికి పాల్పడిన మైనర్, హైదరాబాద్ శివారులో షాకింగ్ ఘటన

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి పై ఏసీబీ పంజా.. అక్రమాస్తులు చూస్తే మీ మైండ్ బ్లాకే?

Big Stories

Advertisement
×