E-Paper
Advertisement

మేడ్చల్ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయం వద్ద నీటి వృథా.. పట్టించకోని అధికారులు!

మేడ్చల్ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయం వద్ద నీటి వృథా.. పట్టించకోని అధికారులు!
Advertisement

Water Wastage: నీటి పొదుపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ప్రభుత్వ కార్యాలయాల గోడలు దాటడం లేదా? నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న వేళ.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. మేడ్చల్‌ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయం వద్ద కార్యాలయం పై ఉన్న నీటి ట్యాంక్ నుంచి నీరు నిండిపోయి పొంగిపొర్లుతున్న దృశ్యం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.

నీటి పొదుపుపై పాఠాలు..

ఓవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు అందుబాటులో ఉన్న నీటిని ఇలా వృథా చేయడం ఎంతవరకు సమంజసం? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై పాఠాలు చెప్పే ప్రభుత్వ యంత్రాంగం.. ముందుగా తన కార్యాలయాల నుంచే ఆచరణ ప్రారంభించాలన్న హితవు వినిపిస్తోంది.

స్థానికులు ప్రశ్నలు..

Advertisement

ప్రభుత్వ కార్యాలయంలోనే నీటి వృథాను అరికట్టలేకపోతే.. ప్రజలకు ఆదర్శంగా ఎలా నిలుస్తారన్న స్థానికులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి పొదుపును పకడ్బందీగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Also read: ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

Tags

Related News

అలియాబాద్‌ మున్సిపాలిటీలో అక్రమ షెడ్ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

ఎస్టీపీ ప్లాంట్లలో AI టెక్నాలజీ.. నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

ఉపాధి పనులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ..!

BRS చేసిన రంకును మాకు అంటగడతారా? హరీష్, KTRలకు మంత్రి ఘాటు కౌంటర్!

కరువు పై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగిస్తాం!- చానగాని దయాకర్

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన సైఫాబాద్ పోలీసులు!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!

Big Stories

Advertisement
×