E-Paper
Advertisement

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!
Advertisement

Sabarimala Booking: అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న శబరిమల మండల-మకరవిళక్కు యాత్రకు సంబంధించి ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. అయ్యప్ప భక్తుల దర్శనాల కోసం వర్చువల్ క్యూ బుకింగ్స్ డేట్ ఫిక్స్ చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కానుంది.

రూట్స్ వారీగా కౌంట్ ఫిక్స్..

శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు www.sabarimalaonline.org అనే అఫీషియల్ పోర్టల్‌లోకి వెళ్లి తమ క్యూ పాస్‌లను బుక్ చేసుకోవాలి. ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు రూట్స్ వారీగా కౌంట్ ఫిక్స్ చేశారు. నిలక్కల్-పంబ మెయిన్ రూట్ ద్వారా రోజూ 60 వేల మందికి ఆన్‌లైన్ బుకింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఇక ట్రెకింగ్ రూట్స్ అయిన ఎరుమేలి ఫారెస్ట్ రూట్, వండిపెరియార్-సత్రం దారుల ద్వారా రోజుకు 3 వేల మంది చొప్పున బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో ముందుగా బుకింగ్స్ చేసుకోలేకపోయిన భక్తుల కోసం కొన్ని స్పెషల్ ఏరియాల్లో స్పాట్ బుకింగ్ కౌంటర్లు కూడా రెడీ చేస్తున్నారు. శబరిమల యాత్ర భక్తుల కోసం ఈ వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి.

యాత్ర సహాయక నిధి..

Advertisement

అయ్యప్ప భక్తులు ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వర్చువల్ క్యూ బుకింగ్ కంప్లీట్‌గా ఫ్రీ. దీని కోసం ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు. అయితే పారిశుద్ధ్యం, ఇతర మెయింటెనెన్స్ కోసం ఎవరైనా వాలంటరీగా సాయం చేయాలనుకుంటే ‘యాత్ర సహాయక నిధి’ లేదా ‘సాధారణ నిధి’కి కనీసం 5 రూపాయల నుంచి ఎంతైనా డొనేట్ చేయవచ్చని బోర్డ్ స్పష్టం చేసింది. సో, స్వామి దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులు పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్స్ బుక్ చేసుకోవడం మంచిది.

Also read: ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం అలర్ట్.. మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు!

Tags

Related News

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు.. 46 మంది మృత్యువాత!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మెట్రోకు కొత్త లింక్ ప్లాన్!

40 రోజులు స్నానం చేయకుండా మహిళల వేషాలు వేసే పురుషులు.. ఈ వేడుక ఎక్కడ జరుగుతుందంటే?

రజనీకాంత్ ‘జైలర్ 2‘ షూటింగ్ లొకేషన్స్ ఇవే.. ట్రావెల్ లవర్స్‌ కు వెరీ స్పెషల్!

యూరప్ రైళ్ల కంటే వందే భారత్ బెటర్.. పోలాండ్ యువతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత పైలట్ ధైర్యానికి యూఏఈ ఫిదా.. అత్యున్నత పురస్కారంతో సత్కారం!

Big Stories

Advertisement
×