E-Paper
Advertisement

ఉపాధి పనులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ..!

ఉపాధి పనులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ..!
Advertisement

El Niño: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు ప్రారంభించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,516 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 244 గ్రామ పంచాయతీల్లో వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపారు. అక్టోబర్ 27న ఉపాధి పనులకు 3,97,788 మంది కూలీలు హాజరు కావడం రికార్డు నెలకొందన్నారు. ఇంకా కూలీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

సర్పంచులు కథానాయకులుగా..

ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని, నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులు చేపట్టాలని, పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సర్పంచులు కథానాయకులుగా వ్యవహరించి ఎల్లీనోను ఎదుర్కోవాలి. గ్రామాల్లో ఉపాధి కూలీలను మోబిలేస్ చేయాలన్నారు. మనకు మౌలిక వసతుల కల్పనకు బోలెడంత బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది

ప్రత్యేక సాఫ్ట్వేర్..

ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి. అభివృద్ధి పనుల్లో వెనుకబడ్డ సర్పంచులు కార్యదర్శులు మండల అధికారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధి పనులు GPSAP లో నమోదు అవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ లో కోటి 12 లక్షల రికార్డులను నమోదు చేశామని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర వివరాలు అందులో పొందుపరిచామని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూలీలకు పనులు కల్పించాలని, చెక్ డ్యామ్ లో నిర్మించాలని అన్నారు. అక్కడి భౌగోళిక జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పనులు కల్పించాలన్నారు.

ఇందిరా గాంధీ జయంతి..

Advertisement

వలసలను నివారించే లక్ష్యంగా ఉపాధి పనులు కల్పించాలి. ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి ప్రజలకు ఎల్ ని నోను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే భరోసా కల్పించాలన్నారు. గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీఅప్పాయింట్ అయిన దాన కిషోర్ ను అభినందించి మంత్రి సీతక్క సత్కరించారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించుకుంటున్నామని అప్పట్లోపు పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.

Also read: కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Tags

Related News

ఎస్టీపీ ప్లాంట్లలో AI టెక్నాలజీ.. నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

BRS చేసిన రంకును మాకు అంటగడతారా? హరీష్, KTRలకు మంత్రి ఘాటు కౌంటర్!

కరువు పై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగిస్తాం!- చానగాని దయాకర్

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన సైఫాబాద్ పోలీసులు!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!

రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!

Big Stories

Advertisement
×