Bigg boss 10:బిగ్ బాస్ సీజన్ 10 మరో నాలుగు వారాల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ కి బూస్ట్ ఇస్తూ మాజీ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పిలిపిస్తూ సీజన్ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 9, సీజన్ 8 కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి ఇద్దరేసి చొప్పున తీసుకొస్తూ సందడి చేస్తున్న బిగ్ బాస్.. ఇప్పుడు మరో ఇద్దరిని పంపించారు. వారెవరో కాదు సిరి హనుమంత్ (Siri Hanumanth), వీ.జే. సన్నీ తాజాగా 81వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో అటు సిరి హనుమంత్, వీ.జే.సన్నీ ఇద్దరు కూడా హౌస్ లో సందడి చేశారు.
తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. త్రిగుణ్ అన్నా.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటను వీ.జే.సన్ని అక్కడ పాడి మరీ కంటెస్టెంట్స్ కి వినిపించారు. ఇక దేబ్జానీ గురించి మాట్లాడుతూ.. బయట అబ్బాయిల మనసు దోచుకుంటున్న కలల రాణివి నువ్వు అంటూ కవిత్వం వల్లించారు. ఇక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంటును నువ్వు క్రియేట్ చేస్తున్నావ్ అంటూ నరేష్ పై ప్రశంసల కురిపించారు. అటు సిరి హనుమంత్ మాట్లాడుతూ.. నాకు తెలిసి నరేష్ ను ఇష్టపడని అమ్మాయి లేదు.. నేను కూడా ఆయన లవ్ లో పడిపోయా అంటూ ప్రపోజ్ చేసింది.
ఇక తర్వాత సన్నీ మాట్లాడుతూ.. వర్షిణి వర్షిణి వర్షిణి ముఖేష్ బాబు సంరక్షిని.. ఇకనుంచి నీ ఆట నువ్వు ఆడమని రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్ గా నీకు అని అంటూ కామెంట్ చేశారు. ఇక శివతో మాట్లాడుతూ..” కార్తీకదీపం అంటే నీకు తెలుసు కదా.. కొత్త టీవీ కొన్నాక ఎలా అయితే మనం హారతి ఇస్తామో.. నువ్వు టీవీలో కనిపించిన ప్రతిసారి హారతి పళ్లెం తీసుకెళ్లి ప్రియాంక నీకు హారతి ఇస్తోంది” అంటూ బయట ప్రియాంక ప్రవర్తన గురించి శివాకి చెప్పి షాక్ ఇచ్చారు సన్నీ, సిరి.
ALSO READ:మెహబూబ్ తో లవ్.. స్పందించిన శ్వేతా నాయుడు!
ఇక సుధీర్ తో మాట్లాడుతూ..” హృదయం నుండి నేను నీకు ఒక మాట చెబుతున్నాను. మీ అమ్మని మా అమ్మ అనుకున్నాను. ఒక శక్తి అలా కాపాడుతోంది నిన్ను.. అది అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే కన్నీళ్లు కనిపించకుండా సన్ గ్లాసెస్ పెట్టి కవర్ చేసి మళ్ళీ తన కామెడీతో నవ్వించాడు సన్నీ. సరదాగా సాగిన ఈ ప్రోమో అటు ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ ప్రోమో ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది.