Basit Ali On Vaibhav: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేయడంపై బాసిత్ ఆలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతి పిన్న వయసులో ఇలాంటి భయంకరమైన ఇన్నింగ్స్ లు ఆడడం అసాధ్యమని… కానీ ఈ బీహార్ కుర్రాడు అవలీలగా డబుల్ సెంచరీ సాధించాడని మెచ్చుకున్నాడు. ఇలాంటి ప్లేయర్ టీమిండియాలో ఉండడం వాళ్ళ అదృష్టమని తెలిపాడు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత తన బ్యాటింగ్ సీక్రెట్స్ బయట పెట్టి వైభవ్ సూర్యవంశీ పెద్ద తప్పిదం చేశాడని మండి పడ్డాడు. డబుల్ సెంచరీ కంటే ముందు యువరాజ్ సింగ్ తో అరగంట పాటు ఫోన్ లో మాట్లాడానని వైభవ్ సూర్యవంశీ చెప్పడం 100% తప్పేనని వెల్లడించాడు. బ్యాటింగ్ సీక్రెట్స్ ఎప్పుడు కూడా మీడియా ముందు లీక్ చేయకూడదని సూచనలు చేశాడు.
యువరాజ్ సింగ్ సూచనల గురించి వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాసిత్ ఆలీ కీలక కామెంట్స్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ తనకు ఒక కొడుకు లాంటివాడని… అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే తనకు సంబరంగా ఉంటుందని వెల్లడించాడు. అయితే యువరాజ్ సింగ్ ఇచ్చిన సలహాల గురించి మీడియా ముందు వైభవ్ మాట్లాడడం అనవసరమని ఫైర్ అయ్యాడు. ఇక్కడే వైభవ్ అంటే తనకు నచ్చలేదని సీరియస్ అయ్యాడు.
బ్యాటింగ్ టెక్నిక్స్ అస్సలు బహిర్గతం చేయకూడదని.. కేవలం సక్సెస్ ఎంజాయ్ చేయాలని సూచించాడు. ఇలా ప్రతి విషయం బయట పెడితే వైభవ్ సూర్యవంశీ కెరీర్ నాశనం అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. 15 ఏళ్ల బుడ్డోడు కాబట్టి వాడికి ఈ విషయాలు తెలియదని.. టీమిండియా సీనియర్లు, బీసీసీఐ పెద్దలు దీనిపై స్పెషల్ క్లాస్ తీసుకోవాలని బాసిత్ అలీ కోరాడు. ఎక్కడ తగ్గాలి? ఎక్కడ ఒదిగి ఉండాలి ? అనే విషయాలను బుడ్డోడికి చెప్పాలని సూచనలు చేశాడు.
యూఏఈ జట్టుపై డబుల్ సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నేపాల్ అలాగే పాకిస్తాన్ జట్లపైన తాను విఫలం కావడంతో యూఏఈ మ్యాచ్ కంటే ముందు యువరాజు సింగ్ తో అరగంట పాటు ఫోన్ లో మాట్లాడినట్టు వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ లోపాలను యువరాజ్ సింగ్ సరిదిద్దారని.. కీలక టిప్స్ తనకు అందించాడని ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఈ వ్యాఖ్యలు నేపథ్యంలోనే బాసిత్ అలీ ఫైర్ అయ్యాడు. బ్యాటింగ్ టెక్నిక్స్ అస్సలు బయట పెట్టకూడదని కోరాడు.