E-Paper
Advertisement

టెంపర్ సీన్ ని ఇంతలా కాపీ కొట్టాలా.. జగదాత్రి సీరియల్‌పై ట్రోల్స్!

టెంపర్ సీన్ ని ఇంతలా కాపీ కొట్టాలా.. జగదాత్రి సీరియల్‌పై ట్రోల్స్!
Advertisement

Jagadhatri Serial Trolls:ఒకప్పుడు సీరియల్స్ కి మూవీస్ టైటిల్స్ కాపీ కొట్టడం, దాంట్లోని మ్యూజిక్ కాపీ కొట్టడం,ఏకంగా అందులోని పాటలు లేపేయడం చాలా కామన్ అన్నట్టుగా ఉండేది .అటు ఆడియన్స్ కూడా దానిని పెద్దగా పట్టించుకునే వారు కాదు.కానీ ఇపుడు ఏకంగా సినిమాలలోని సీన్లనే ఎత్తేయడం మొదలెట్టారు సీరియల్ మేకర్స్.ఇదిగో TRP పరంగా దుమ్ము రేపే జగద్దాత్రి సీరియల్ లో అదే జరిగింది మరి.

టెంపర్ సినిమాలోని కోర్టు సీన్ ని మక్కీకి మక్కి

Advertisement

ఆ సినిమాలోని ఒక కోర్టు సీన్ కోసం సీరియల్ మేకర్స్ ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలోని కోర్టు సీన్ ని మక్కీకి మక్కి దించడంతో ఇపుడు నెటిజన్లకి ఒక్కసారిగా ఈ సీరియల్ మాంచి స్టఫ్ అయిపొయింది.అసలు మేకర్స్ కథలు రాయడం మానేశారా లేక సరైన కథ దొరకలేదా అంటూ ఎకిపారేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

విషయంలోకి వస్తే కేదార్ గా దర్ష్ చంద్రప్ప, జగద్దాత్రిగా దీప్తి మన్నే ప్రధాన పాత్రలో నటిస్తున్న జగదాత్రి సీరియల్ ఎంతటి క్రేజ్ దక్కించుకుందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ఈ సీరియల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇందులోని సీరియస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మంచి ఉత్కంటని రేపుతుండటంతో ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఏం జరుగుతుందా అంటూ క్యూరియస్ గా ఫాలో అయిపోతుంటారు బుల్లి తెర ప్రేమికులు.

Advertisement

ఆ గ్యాంగ్ లో నేను కూడా ఉన్నా

అయితే తాజాగా ఈ సీరియల్ లోని ఒక సీన్ లో స్వాతి అనే స్టూడెంట్ పై కిడ్నాప్ మరియు అత్యాచారం జరిగిందన్న కేసులో నిందితులకి వ్యతిరేఖంగా ఎలాంటి ఎవిడెన్స్ లేవంటూ కేసుని జడ్జి కొట్టేసే సమయంలో కేదార్ ఎంట్రీ ఇస్తాడు.కిడ్నాప్ చేసి అత్యాచారం జరిగిందని,ఎందుకంటే ఆ గ్యాంగ్ లో నేను కూడా ఉన్నానంటూ కోర్టులో బోను ఎక్కి జడ్జి ముందు బాంబు పేలుస్తాడు. ఇదిగో సరిగ్గా ఈ సీన్ చూసే కామెంట్లకి పని పెట్టారు నెటిజన్లు .

ఈ సీన్ టెంపర్ సినిమాలోనిది అని ,తారక్ కూడా వంశీ అండ్ గ్యాంగ్ ని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టడానికి ఇలాగే నేను కూడా వాళ్ళతో కలిసి ఈ రేప్ లో పాల్గొన్నాను అని, దయచేసి అందరికి కలిపి శిక్ష వేయండి అని జడ్జిని వేడుకునే సీన్ ని ఇలా సీరియల్ కోసం మక్కీకి మక్కీ దించేశారు అంటూ కామెంట్లకి పని పెట్టారు.అసలు స్టోరీ లేకుండా సీరియల్ ని ఎలా నెగ్గుకొస్తున్నారో అని కొందరు అంటే ఇలానే అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు.

 ఇంకెన్ని విమర్శల బాణాలని ఎదుర్కొవాలో !

ఇక మరొకరు అయితే కేదార్ ఎదో పక్క క్లాస్ రూమ్ లోకి డస్టర్ కోసం వెళ్లినట్టు చాలా సింపుల్ గా కోర్టు లోకి వెళ్ళిపోయాడు అని అంటే ముందు ఈ కాపీ పేస్టులు ఆపి కొంచెం కొత్తగా ఆలోచించండి అంటూ మరికొంతమంది విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.

అయితే సీరియల్స్ లో అప్పుడప్పుడు ఇలాంటివి సహజమే అని, వాటిని పట్టించుకోకుండా సీరియల్స్ ని చూడాలని, మరీ ముఖ్యంగా ఈ సీరియల్ చాలా బాగుంటుంది అంటూ కొంతమంది సపోర్టివ్ గా కామెంట్స్ పెట్టడం విశేషం.చూడాలి మరి ముందు ముందు ఈ కోర్ట్ సీన్ ఇంకెన్ని విమర్శల బాణాలని ఎదుర్కొవాలో !

ALSO READ :మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

Tags

Related News

నన్ను చూసిన ప్రతి మగాడు చెమటలు కక్కుతున్నారు.. శ్రీముఖి బోల్డ్ కామెంట్స్!

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

ఇండస్ట్రీలో విషాదం.. ‘సీఐడీ’ డైరెక్టర్ బీ.పీ.సింగ్ మృతి!

‘గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!

తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక షాలిని ఏం చేస్తోందో తెలుసా?

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!

Big Stories

Advertisement
×