Hyderabad: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదు ట్రావెల్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంతకీ అనుకోకుండా ఘటన జరిగిందా? కావాలనే ఎవరైనా ఈ పని చేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
#Hyderabad—
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పార్కింగ్ యార్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. pic.twitter.com/ke7qXx7ug3— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 15, 2026