E-Paper
Advertisement

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోకి.. పాలిటెక్నిక్ కళాశాలలు!

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోకి.. పాలిటెక్నిక్ కళాశాలలు!
Advertisement

Skills University: రాష్ట్రంలోని సాంకేతిక, నైపుణ్య విద్యా సంస్థల పరిపాలనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం కిందకు తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజు జీవో విడుదల చేశారు.

జీవో 97ను విడుదల..

గతంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పేరును ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్(శక్తి)’గా మారుస్తూ ప్రభుత్వం జీవో 97ను విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. అయితే, పాలిటెక్నిక్ విద్య ఆధునికీకరణ, విద్యార్థుల విద్యా, కెరీర్ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఆగస్టు 24న ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తాజాగా పాత జీవోకు సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ..

Advertisement

సవరించిన ఉత్తర్వుల ప్రకారం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు రెండూ ఇకపై విద్యాశాఖ(ఉన్నత విద్య) పరిపాలనా నియంత్రణలో పనిచేయనున్నాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు యథావిధిగా ‘శక్తి’ శాఖ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. అయితే వీటి కరిక్యులమ్ నియంత్రణ మాత్రం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. అకడమిక్ ప్రోగ్రామ్స్ మరింత విస్తరించేందుకు ఏఐసీటీఈ, ఇతర సంబంధిత సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు స్కిల్స్ యూనివర్సిటీ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also read: దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ సవాల్!

Tags

Related News

దేశ పోలీసు వ్యవస్థకే గ్రేహౌండ్స్‌ రోల్ మోడల్: డీజీపీ సీవీ ఆనంద్

భారత్ సమ్మిట్ పేరుతో దేశానికి అవమానం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

రియల్టర్​ హత్యకు 10లక్షల సుపారీ.. ఏడుగురు అరెస్ట్!

ఇంటిపై రెండు నిమిషాల పాటు డ్రోన్ కలకలం.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్నలు!

తలవంచి తిరిగి వస్తారా.. లేక ప్రధానిని నిలదీస్తారా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్!

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. PHFI క్యాంపస్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×