E-Paper
Advertisement

అఖండ భారత్ లో ఇన్ని దేశాలు ఉండేవా? పాకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఆసక్తికర విశేషాలివే!

అఖండ భారత్ లో ఇన్ని దేశాలు ఉండేవా? పాకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఆసక్తికర విశేషాలివే!
Advertisement

Akhand Bharat History: భారతదేశ చరిత్రలో తరచూ వినిపించే పదాల్లో అఖండ భారత్ (Akhand Bharat) ఒకటి. అవిభక్త భారతదేశాన్ని సూచించే ఈ పేరు వెనుక ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. ప్రాచీన కాలంలో భారత ఉపఖండంలోని అనేక ప్రాంతాలు ఒకే నాగరికత, సంస్కృతి, వాణిజ్య సంబంధాలతో అనుసంధానమై ఉండేవి.  కాలక్రమేణా రాజకీయ మార్పులు, విదేశీ పాలనలు, ఒప్పందాలు, మతపరమైన విభేదాల కారణంగా ఈ ప్రాంతాలు వేర్వేరు దేశాలుగా ఏర్పడ్డాయి.

అఖండ భారత్‌లో ఎన్ని దేశాలు ఉన్నాయి?

అఖండ భారత్ లో ప్రస్తుత భారత ఉపఖండంలోని 8 నుంచి 9 దేశాలు కలిసి ఉండేవి. అవి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు. కొన్ని చారిత్రక, సాంస్కృతిక భావనల్లో టిబెట్ ప్రాంతాన్ని కూడా ఇందులో భాగంగా చూపిస్తారు. ఈ దేశాలన్నీ గతంలో ఒకే రాజ్యంలో భాగంగా ఉన్నాయని చెప్తారు. అఖండ భారత్ అనేది ప్రధానంగా ఒక చారిత్రక, సాంస్కృతిక భావనగానే గుర్తిస్తారు.

అఖండ భారత్ నుంచి దేశాలు ఎలా విడిపోయాయి?

Advertisement

ఈ ప్రాంతాలు వేర్వేరు దేశాలుగా మారడానికి బోలెడు చారిత్రక పరిణామాలు కారణమయ్యాయి. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఆఫ్ఘనిస్తాన్: బ్రిటిష్, రష్యన్ సామ్రాజ్యాల మధ్య జరిగిన అధికార పోరు (The Great Game) ఆఫ్ఘనిస్తాన్ చరిత్రపై ప్రభావం చూపింది. 1893లో డ్యూరాండ్ లైన్ ఏర్పాటుతో బ్రిటిష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దులు వచ్చేశాయి.

Advertisement

⦿ నేపాల్, భూటాన్: బ్రిటిష్ పాలన సమయంలో ఈ రెండు హిమాలయ రాజ్యాలు ప్రత్యేక రాజకీయ ప్రతిపత్తిని కొనసాగించాయి. బ్రిటిష్ ఇండియాలో నేరుగా విలీనం కాలేదు.

⦿ శ్రీలంక: అప్పట్లో సిలోన్‌ గా పిలిచే శ్రీలంకను 1935లో కాకుండా 1798 నుంచే బ్రిటిష్ వారు ప్రత్యేకంగా పరిపాలించడం ప్రారంభించారు. భారతదేశంతో దాని పరిపాలనా సంబంధాలు వేర్వేరుగా కొనసాగాయి.

⦿ మయన్మార్: 1937 ఏప్రిల్ 1న బర్మాను బ్రిటిష్ ఇండియా నుంచి అధికారికంగా వేరు చేశారు. అప్పటి నుంచి ప్రత్యేక బ్రిటిష్ కాలనీగా పరిపాలించారు.

1947లో భారత విభజన.. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం

అఖండ భారత్ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం 1947 దేశ విభజన. బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో మతపరమైన రాజకీయాలు, ప్రత్యేక దేశం కోసం ముస్లిం లీగ్ చేసిన డిమాండ్, పెరుగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో భారత్ రెండు దేశాలుగా విడిపోయింది. ఆగస్టు 14న పాకిస్తాన్, ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అప్పట్లో పాకిస్తాన్‌లో పశ్చిమ పాకిస్తాన్‌తో పాటు తూర్పు పాకిస్తాన్ కూడా ఉండేది. భాషా, రాజకీయ, ఆర్థిక వివక్ష కారణంగా అక్కడ స్వాతంత్ర్య ఉద్యమం బలపడింది. 1971లో జరిగిన విమోచన పోరాటంలో భారత్ సహకారంతో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది.

చరిత్రలో ప్రత్యేక స్థానం

అఖండ భారత్ భావన కేవలం భూభాగాల గురించి మాత్రమే కాకుండా, ఈ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికతలు, సంస్కృతులు, సంప్రదాయాలు, వాణిజ్య సంబంధాలను కూడా గుర్తుచేస్తుంది.

Read Also: పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

Tags

Related News

ట్రావెల్ ట్రిప్ ప్లానింగ్ కోసం AI ఉపయోగిస్తున్నారా? ఈ సమస్యలు రావచ్చు జాగ్రత్త

60 రోజుల టికెట్ బుకింగ్‌ రూల్ మారనుందా? రైల్వే కొత్త ప్లాన్ ఇదే!

8 ఫాస్ట్ నమో భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయాణికులకు ఇక పండుగే!

పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. ఎయిర్ ఇండియా కీలక హెచ్చరిక!

RAC విధానానికి గుడ్ బై.. రైల్వే సంచలన నిర్ణయం!

ప్రపంచం చూపు భారత్‌పైనే..టూరిస్టులను కట్టిపడేసే 10 అద్భుత ప్రదేశాలు ఇవే!

Big Stories

Advertisement
×