Bigg boss 10:బిగ్ బాస్.. వరల్డ్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎక్కడో పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ పేరిట ప్రారంభమైన ఈ రియాలిటీ షోని హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలో వచ్చిన ఆదరణకు మిగతా భాషలు కూడా ఈ షోని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఒక్కటేమిటి ఇండియన్ భాషలలో ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. ఇదిలా ఉండగా తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తికాగా.. పదవ సీజన్ కూడా అప్పుడే 10 వారాలు పూర్తి చేసుకుంది.
బిగ్ బాస్ సీజన్ 10 లో భాగంగా పదో వారం ఫ్యామిలీ వీక్ నడిచిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు.వారాంతంలో కంటెస్టెంట్స్ తరఫున సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. నేటి ఎపిసోడ్లో ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు రివీల్ చేయబోతున్నారు. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ కోసం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) సపోర్ట్ చేస్తున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పూరీ జగన్నాథ్ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ అందిస్తున్న ఆ కంటెస్టెంట్ ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ తరఫున సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో భాగంగానే టెంపర్ వంశీ (Temper Vamshi) తరఫున ప్రముఖ స్టార్ కమెడియన్ ఆలీతోపాటు ఆయన సతీమణి జుబేదా కూడా స్టేజ్ పై సందడి చేశారు. ప్రముఖ కమెడియన్ వంశీ తరఫున వచ్చిన స్టార్ కమెడియన్ అలీ మాట్లాడుతూ.. “పూరీ జగన్నాథ్ గారు నీకోసం జియో హాట్ స్టార్ యాప్ ఎక్కించుకొని మరీ ప్రతిరోజు నీకు ఓటింగ్ వేస్తున్నారు” అని చెప్పి అందరిని సర్ప్రైజ్ చేశారు అలీ. మొత్తానికైతే పూరీ జగన్నాథ్ టెంపర్ వంశీ కోసం ఓటింగ్ వేస్తూ ఆయన గెలవాలని సపోర్ట్ చేస్తున్నారని చెప్పడంతో.. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే నేటి సెలబ్రిటీ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ కి కావలసినంత సపోర్టు లభించనుంది అని చెప్పవచ్చు.
also read:తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!
ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2015 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం టెంపర్ . జూనియర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సోదరుడిగా నటించిన నటుడు వంశీ.. ఈ సినిమాతో ఊహించని ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఇక అందుకే ఈ సినిమా టైటిల్ ని తన ఇంటిపేరుగా మార్చుకొని టెంపర్ వంశీగా చలామణి అవుతున్నారు. ఇక ఇప్పటికే పైసా వసూల్, డబుల్ ఇస్మార్ట్ వంటి పూరి జగన్నాథ్ అనేక ప్రాజెక్టులలో నటించి పేరు దక్కించుకున్న వంశీ.. ఇప్పుడు బిగ్ బాస్ 10 లోకి అడుగుపెట్టారు. ఆ సన్నిహిత్యం తోనే పూరీ జగన్నాథ్ ఈయనకు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.