E-Paper
Advertisement

దేశ పోలీసు వ్యవస్థకే గ్రేహౌండ్స్‌ రోల్ మోడల్: డీజీపీ సీవీ ఆనంద్

దేశ పోలీసు వ్యవస్థకే గ్రేహౌండ్స్‌ రోల్ మోడల్: డీజీపీ సీవీ ఆనంద్
Advertisement

Telangana Greyhounds: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ గ్రే హౌండ్స్‌ దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శమని డీజీపీ సీ.వీ.ఆనంద్‌ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాదం, హైజాకింగ్‌ వంటి ముప్పులను ఎదుర్కోవడంలో..రాష్ట్ర అంతర్గత భద్రతతోపాటు దేశ భద్రతలోనూ గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ గ్రేహౌండ్స్‌ తరహా ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారన్నారు. రాజేంద్రనగర్ లో శనివారం గ్రేహౌండ్స్‌ షూటింగ్‌ హౌస్‌ ను ప్రారంభించిన సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 1980ల కాలంలో నక్సల్స్‌ కార్యకలాపాలు, ఉగ్రవాద ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్‌ విశేష పాత్ర పోషించిందని గుర్తుచేశారు.

పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Advertisement

ఇటీవల అక్టోబరు 31న గుజరాత్‌ లోని కెవాడియాలో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్‌ కార్యక్రమంలో తెలంగాణ గ్రేహౌండ్స్‌ ప్రదర్శించిన కవాతు అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. గ్రేహౌండ్స్‌ సిబ్బంది మెరుగైన శిక్షణ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రేహౌండ్స్‌ సిబ్బంది సంఖ్య కనీసం 700 మందికి తగ్గకుండా ఉంటుందన్నారు. కర్రెగుట్టలు ప్రాంతాల్లో సాధనతోపాటు అటవీ ప్రాంతాల్లో జంగిల్‌ ప్రాక్టీస్‌, వార్‌ ఫేర్‌ శిక్షణను నిరంతరం కొనసాగించాలన్నారు. హైజాకింగ్‌, ఉగ్రవాద దాడులు, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రథమ బహుమతిని సాధించాలి..

Advertisement

రాజస్థాన్‌లోని జోధ్‌ పూర్‌లో 2027 ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ఆల్‌ ఇండియా పోలీస్‌ కమాండో పోటీల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ బృందం ప్రథమ బహుమతి సాధించాలని ఆకాంక్షించారు. గ్రే హౌండ్స్​ ఆపరేషన్స్‌ డీజీ డాక్టర్​ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ సిబ్బందికి పూర్తి అంకితభావంతో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శారీరక దృఢత్వం, బ్రీఫింగ్‌, ఫైరింగ్‌ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

త్యాగాలకు ప్రతీకగా…

విధి నిర్వహణలో అమరులైన సందీప్‌, పవన్‌, శ్రీధర్‌ త్యాగాలకు స్మృతికి షూటింగ్​ హౌస్​ కు ఎస్పీఎస్​ ఓఓడీఏ షూట్‌ హౌస్‌’ అని నామకరణం చేశారు. ఓఓడీఏ అంటే అబ్జర్వేషన్, ఓరియంట్​, డిసైడ్​, యాక్ట్​ అని వివరించారు. కమాండోల విధి నిర్వహణలో కీలకమని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరిస్థితులను అంచనా వేసి, సరైన నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. కార్యక్రమంలలో రాజేంద్రనగర్​ డీసీపీ శ్రీనివాస్​, ఏఎస్పీ ఫాతిమా, గ్రూప్​ కమాండర్ల మహ్మద్​ అష్ఫాక్, వెంకటేశ్వర్లు, స్క్వాడ్రన్‌ కమాండర్‌ రాజు, క్యాంపు కమాండెంట్ విద్యాసాగర్‌, కమ్యూనికేషన్‌ డీఎస్పీ సలీం, అసిస్టెంట్ కమాండెంట్ మహ్మద్​ షరీఫ్‌ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: భారత్ సమ్మిట్ పేరుతో దేశానికి అవమానం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

Tags

Related News

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోకి.. పాలిటెక్నిక్ కళాశాలలు!

భారత్ సమ్మిట్ పేరుతో దేశానికి అవమానం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

రియల్టర్​ హత్యకు 10లక్షల సుపారీ.. ఏడుగురు అరెస్ట్!

ఇంటిపై రెండు నిమిషాల పాటు డ్రోన్ కలకలం.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్నలు!

తలవంచి తిరిగి వస్తారా.. లేక ప్రధానిని నిలదీస్తారా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్!

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. PHFI క్యాంపస్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×