E-Paper
Advertisement

పదో తరగతి మెమోలో తప్పులా? విద్యార్థులకు ఇకపై నో టెన్షన్, మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు

పదో తరగతి మెమోలో తప్పులా? విద్యార్థులకు ఇకపై నో టెన్షన్, మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు
Advertisement

Hyderabad: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పదో తరగతి మెమోలో తప్పులుంటే వాటిని సరి చేసుకోవడానికి విద్యాశాఖ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నేరుగా మీ సేవ సెంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకుంటే చాలు. ఇక మీ పని సులభంగా అయిపోయినట్టే.  దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్.

పదో తరగతి విద్యార్థులకు ఇకపై నో టెన్షన్

పదో తరగతి పరీక్షలు చెప్పగానే చాలు. చాలా మంది తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఎందుకంటే ఎస్ఎస్‌సీ మెమోలో పదే పదే తప్పులు కనిపిస్తున్నాయి. ప్రతీ ఏడాది వేలాది మంది విద్యార్థులకు ఈ తరహా కష్టాలు తప్పలేదు. తప్పులు కరెక్టు చేసుకోవడానికి విద్యాశాఖ చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతున్న సందర్భాలు ప్రతీ ఏటా సాధారణంగా మారిపోయింది. దీన్ని గమనించింది ప్రభుత్వం, ఈసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

Advertisement

పదో తరగతి మెమోలో పేరు, పుట్టిన తేదీ వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ బోర్డును తల్లిదండ్రులు సంప్రదించేవారు. అవసరమైన డాక్యుమెంట్లతో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మరింత ఈజీ చేసింది. ఆ విధంగా తప్పు లున్నవారు మీ సేవ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించింది ప్రభుత్వం.

మెమోలో తప్పులుంటే మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు

దగ్గరలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి మెమోలో సరి చేయాల్సిన వివరాలను తెలియజేయాలి. అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. మీ వివరాలు అన్నీ మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేస్తారు. ఆ తర్వాత  విద్యార్థులు చదివిన పాఠశాలకు వెళ్తుంది. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాటిని పరిశీలిస్తారు. విద్యార్థులు సమర్పించిన ఆధారాలు చెక్ చేసిన తర్వాత ISMS పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు మండల విద్యాధికారి-MEO వద్దకు వెళ్తుంది.

Advertisement

ALSO READ: ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

విద్యార్థి సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత MEO దరఖాస్తు దాదాపుగా ఆమోదించవచ్చు. మండల విద్యాధికారి ఆమోదం తర్వాత కొన్నిస్థాయిల్లో అధికారులు పరిశీలన చేస్తారు. అన్నిస్థాయిల్లో పరిశీలన చేసి ఆమోదం తర్వాత విద్యార్థి SSC మెమోలో మార్పులు చేస్తారు. సరి చేసిన వివరాలతో కొత్త మెమో పొందే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే కారణాలను సంబంధిత అధికారులు తెలియజేయాలి. మొత్తానికి దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు మీ సేవ ద్వారా చెక్ చెప్పింది ప్రభుత్వం.

Related News

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఎగిరిగంతేస్తున్న విద్యార్థులు, అసలు విషయం తెలుసా?

ఆ చింత అవసరం లేదు.. సింగిల్ విండో విధానం, సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు.. బీఆర్ఎస్ కేవలం అందుకే, రాజగోపాల్ ఆరోపణలు నిజమేనన్న కవిత

హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆఫీసులకు వెళ్లేవారు..

కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు చెక్.. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలపై క్లారిటీ?

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రిజిస్ట్రేషన్!

Big Stories

Advertisement
×