E-Paper
Advertisement

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Advertisement

Khelo India Games: తెలంగాణ గడ్డపై మరో ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరగనున్న ‘ఖేలో ఇండియా’ పోటీలను దేశమే ఆశ్చర్యపోయేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని గట్టిగానే హెచ్చరించారు. అసలు ఈ పోటీల నిర్వహణ కోసం సీఎం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం..

అట్టహాసంగా ఆరంభం.. ఘనంగా ముగింపు

Advertisement

డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అలాగే 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలను అంతే గ్రాండ్‌గా ప్లాన్ చేయాలన్నారు. పోటీలు జరిగే రోజుల్లో హైదరాబాద్ నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఉండాలన్నారు. ఇందుకోసం పోలీస్, మున్సిపల్ విభాగాలు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

మంత్రులకు జిల్లాలవారీ బాధ్యతలు

Advertisement

పనులన్నీ పక్కాగా జరగడానికి ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని బాధ్యులుగా చేయడంతో పాటు, జిల్లాలవారీగా మంత్రులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కలిసి క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను చూసుకోనున్నారు. ఇక మహబూబ్‌నగర్ బాధ్యతలను జూపల్లి కృష్ణారావుకు, వరంగల్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, కరీంనగర్‌ను అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగించారు. అలాగే ఖమ్మం బాధ్యతలను తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పర్యవేక్షణను సుదర్శన్ రెడ్డి చూసుకోవాలని సీఎం సూచించారు.

నాణ్యతలో రాజీ వద్దు.. బెస్ట్ కోచ్‌ల నియామకం

దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, అతిథులకు అందించే ఆహారం, వసతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. స్టేడియంల పునరుద్ధరణ పనుల్లో క్వాలిటీ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు దేశంలోనే అత్యుత్తమ కోచ్‌లను నియమించి, మన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించాలని దిశానిర్దేశం చేశారు.

Also Read: సుప్రీం ఆదేశాలు ఉన్నా.. తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం.. కారణాలేంటో కుండబద్దలు కొట్టిన మధురై కలెక్టర్!

Tags

Related News

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఎగిరిగంతేస్తున్న విద్యార్థులు, అసలు విషయం తెలుసా?

ఆ చింత అవసరం లేదు.. సింగిల్ విండో విధానం, సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు.. బీఆర్ఎస్ కేవలం అందుకే, రాజగోపాల్ ఆరోపణలు నిజమేనన్న కవిత

హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆఫీసులకు వెళ్లేవారు..

కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు చెక్.. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలపై క్లారిటీ?

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రిజిస్ట్రేషన్!

ఆ లెక్కలు అన్ని బైటపెట్టండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్?

Big Stories

Advertisement
×