BigTV English
Advertisement

Mallareddy dance: మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి డ్యాన్స్.. వీడియో మస్త్ వైరల్

Mallareddy dance: మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి డ్యాన్స్.. వీడియో మస్త్ వైరల్

Mallareddy dance video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే ఆ హవా వేరే లెవల్‌లో ఉంటది. ఎక్కడకి వెళ్లినా ఆయన చురుకుదనంతో ఇట్టే నవ్వులు పూయిస్తాడు. 24/7 ఫుల్ జోష్‌లో ఉంటారు. మల్లారెడ్డి తెర మీద కనిపించినా.. ఆయన నోరు విప్పి మాట్లాడిన అక్కడ ఉన్నవారు నవ్వక తప్పదు. కాలేజ్ ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు, స్పీచ్‌లతో ఇలా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిన మల్లారెడ్డి.. కొన్ని రోజులు పొలిటికిల్ సీన్‌లో పెద్దగా కనిపించలేదు. గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు అయితే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆయన గురించి తెలియని వారు ఉండరంటే ఆయనకు ఎంత ఫాల్లోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఈయనను కొందరు మాస్ మల్లన్నగా పిలుస్తారు. పబ్లిక్‌లో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆయనకు భలే క్రేజ్ ఉంది. తెలంగాణలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా మల్లన్న గురించి చెబుతారు. మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఎగబడుతారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం సోషల్ మీడియాలో మల్లన్నకు నాకంటే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పారు. ఇలా మల్లన్న ఎక్కడకు వెళ్లినా ఫుల్ జోష్ లో ఉంటారు.

ALSO READ: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం


తాజాగా మరో సారి మల్లారెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడువు.. నడువు.. నడవవే రామక్క పాటకు ఆయన చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తిలో ఈ రోజు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆలియాబాద్ చౌరస్తా వద్ద మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి వారిలో జోష్ నింపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ: SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. శాలరీ రూ.70వేలు, దరఖాస్తుకు చివరి తేది..?

Related News

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

CM Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్.. అందుకే ఫామ్‌హౌస్‌కి, తారలతో తిరిగే కల్చర్ ఎవరిది?

Big Stories

×