SAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిప్లొమా, బీటెక్, బీఈ, పీజీ, ఎంబీబీఎస్, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ)లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 35
స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
యంగ్ ప్రొఫెషనల్: 35 పోస్టులు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 25
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 10
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎల్ఎల్ బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: 32 ఏళ్లు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండాలి. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండాలి.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వేతనం ఉంటుంది.
Also Read: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
పోస్టుల సంఖ్య: 35
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 10
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా
జీతం: రూ.50వేల నుంచి రూ.70వేలు