BigTV English

Rashmi : రేష్మికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్.. షాక్ లో సుధీర్..

Rashmi : రేష్మికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్.. షాక్ లో సుధీర్..

Rashmi: రష్మీ గౌతమ్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు.. తన టాలెంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.. యాంకరింగ్ లో సుమా తరువాత రష్మినే అనేంత క్రేజ్ ని సంపాదించుకుంది.. ప్రస్తుతం రష్మీ గౌతమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. నేడు ప్రసారమైన షోలో రష్మీ గౌతమ్ పుట్టినరోజు స్పెషల్ ఎపిసోడ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఆర్టిస్టులు అందరూ తనకు ఇచ్చిన సర్ప్రైజ్ని చూసి రష్మి అయితే చాలా హ్యాపీ ఫీలయ్యింది.. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి.? ఆ సర్ప్రైజ్ లోకి ప్రభాస్ ఎలా వచ్చాడో ఇప్పుడు చూద్దాం..


విషెస్ చెప్పిన ప్రభాస్..

నేడు ప్రసారమైన షోలో రష్మీ గౌతమ్ పుట్టినరోజు స్పెషల్ ఎపిసోడ్ లో హాఫ్ టీమ్ ఒకవైపు.. మరో హాఫ్ టీమ్ మరోవైపు డివైడ్ అయ్యి రష్మీకి సర్ప్రైజ్స్ ఇచ్చారు. అందులో భాగంగా బుల్లెట్ భాస్కర్ రష్మీకి ఒక సర్ప్రైజింగ్ వీడియోను ప్లే చేసి చూపించారు.. ఈ వీడియోలో పలువురు ప్రముఖ, సినీ సెలబ్రిటీస్ రష్మి గౌతమ్ కి బర్త్డే విషెస్ చెప్పడం విశేషం.. ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రష్మీకి బర్త్డే విషెస్ చెప్పడమే కాకుండా హ్యాపీ బర్త్డే బుజ్జి అని అనడంతో.. నా పేరు బుజ్జి కాదు కదా అని రేష్మి అంటుంది. వెంటనే ఆది వాళ్ళు ఎవరో బుజ్జి తల్లి అంటే రెస్పాండ్ అయ్యావు.. మా ప్రభాస్ బుజ్జి అంటే అడ్జస్ట్ అవ్వలేవా అంటూ కౌంటర్ వేస్తాడు.. దీంతో ఇది చూసిన వారంతా ప్రభాస్ ఇన్ డైరెక్ట్ గా రష్మికి బర్త్డే విషెస్ చెప్పేలా చేశారు భాస్కర్ అన్న, ఇక ఈ వీడియో సుధీర్ చూస్తే ఏమైనా ఉందా.. పాపం సుధీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. రష్మీకి ప్రభాస్ ఇన్ డైరెక్ట్ గా బర్త్డే విషెస్ చెప్పిన ఈ షో చూసిన సుధీర్ అయితే నిజంగానే షాక్ అయ్యాడట.


సెలబ్రెటీల విషెస్..

భాస్కర్ ప్లే చేసిన వీడియోలో ప్రభాస్ మాత్రమే కాకుండా రష్మీకి మరి కొంతమంది సెలబ్రెటీలు బర్త్డే విషెస్ చెప్పారు. గతంలో బర్త్డే విషెస్ చెబుతూ చేసిన వీడియోస్ తీసుకొని.. వాటిని క్లబ్ చేసి రష్మీకి బర్త్డే విషెస్ చెప్పినట్టుగా క్రియేట్ చేశారు. హాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎవరికో బర్త్డే విషెస్ చెప్పిన వీడియోని ఈ వీడియోలో క్లబ్ చేసి ప్లే చేశారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ కిక్ బాక్సింగ్ స్టార్ వీడియోస్ అన్ని క్లబ్ చేసి.. రష్మీ బర్త్ డే కి ఈ స్టార్స్ అందరూ బర్త్డే విషెస్ చెప్పినట్టుగా క్రియేట్ చేసిన వీడియో చూసి.. రష్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరందరూ నా కోసం ఇంతలా సర్ప్రైజ్ ఇస్తున్నందుకు నేను ఎప్పటికీ ఈ సర్ప్రైజెస్ మర్చిపోనని రష్మీ తెలిపింది.

అక్కడ బర్త్డే పార్టీ ..

ఇక ఈ షో ఎండింగ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలోని నటీనటులంతా కలిసి రష్మి బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంతో పాటు.. ప్రతి ఒక్కరూ తన దగ్గరకి ఇండివిడ్యువల్ గా వచ్చి వారి మనసులో రష్మి స్థానం ఏంటో తెలిపి.. ప్రతి ఒక్కరు కూడా ఒక్కో గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇక ఈ షో ఎండింగ్ లో రష్మీ బర్త్ డే కేక్ ను అందరూ కలిసి కట్ చేయించి కేక్ తినిపిస్తారు.. ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు నువ్వు జరుపుకోవాలని.. పెంపుడు జంతువుల పై నువ్వు చూపించే ప్రేమ, రియాక్ట్ అయ్యే విధానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని.. నీ మంచితనమే నిన్ను కాపాడుతుందని అందరూ రష్మీ గౌతమ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఈరోజు షోని ఎండ్ చేస్తారు.

Deepika Rangaraju : ముద్దులిస్తే చాలు, ఫుడ్ కూడా అవసరం లేదు, ఆ తర్వాత బెడ్‌పై.. ‘బ్రహ్మముడి’ దీపిక బోల్డ్ కామెంట్స్

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×