E-Paper
Advertisement

Pawan Kalyan : తెలంగాణ స్ఫూర్తితోనే పార్టీ నడుపుతున్నా.. ఏపీలో పోరాడుతున్నా..

Pawan Kalyan : తెలంగాణ స్ఫూర్తితోనే పార్టీ నడుపుతున్నా.. ఏపీలో పోరాడుతున్నా..
Advertisement

Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. వరంగల్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని అన్నారు.

తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలా తిరుగుతున్నానో ఈ రాష్ట్రంలోనూ అలాగే తిరుగుతున్నానన్నారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారో అది సాధిస్తానన్నారు. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానని వివరించారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో అవినీతి రాజ్యమేలడం బాధ కలిగిస్తోందన్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా దళిత సీఎంను చూడలేకపోయామని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే బీసీనైనా సీఎంను చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీతో కలిశానని చెప్పారు. తనకు ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు తాను కూడా మద్దతు ఇచ్చానన్నారు.

వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తానన్నారు. డబ్బు లేకపోయినా బలం లేకపోయినా గుండెబలంతో నిలబడ వచ్చని వరంగల్ గడ్డ నుంచి నేర్చుకున్నానని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రావు పద్మ , వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×