E-Paper
Advertisement

Homemade Wine: యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. ఏకంగా 377 లీటర్లు, చివరికి ఎలా దొరికిపోయారంటే?

Homemade Wine: యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. ఏకంగా 377 లీటర్లు, చివరికి ఎలా దొరికిపోయారంటే?
Advertisement

Homemade Wine: స్వేచ్చ బ్యూరో: యూ ట్యూబ్ చూసి వైన్​ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆ తరువాత ఇంట్లోనే పెద్దమొత్తంలో వైన్​ తయారు చేస్తూ అమ్మటం ఆరంభించాడు. చివరకు ఎక్సయిజ్ అధికారులకు పట్టుబడ్డాడు. పక్కాగా సమాచారాన్ని సేకరించి నిందితున్ని పట్టుకున్న అధికారులు నిందితుని నుంచి 377 లీటర్ల వైన్​ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక్కో బాటిల్ ధర..

ఆంటోనీ పీటర్​ అనే వ్యక్తి తేలికగా డబ్బు సంపాదించేందుకు ఇంట్లోనే వైన్​ తయారు చేయటం మొదలు పెట్టాడు. గ్రేప్స్​, పైనాపిల్​, జామ, మోసంబీ, సపోటా, అరటిపండు, తమలపాకు ఫ్లేవర్లతో వైన్​ తయారు చేసి 740 మిల్లీలీటర్ల బాటిళ్లలో నింపుతున్నాడు. ఆ తరువాత నేరెడ్​ మెట్​, సికింద్రాబాద్​, కాప్రా తదితర ప్రాంతాల్లో ఒక్కో బాటిల్​ ను 3వందల రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారం అందగా మల్కాజిగిరి డీటీఎఫ్​ సీఐ భరత్ కుమార్​, ఎస్​ఐ శ్రీనివాస్​ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి నిందితుని ఇంటిపై దాడి చేశారు.

Advertisement

Also Read: బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!

సీజ్​ చేసిన వైన్​ విలువ..

పెద్ద మొత్తంలో 5‌‌02 బాటిళ్ల వైన్​‌ను స్వాధీనం చేసుకుని ఆంటోనీ పీటర్​‌ను అరెస్ట్​ చేశారు. సీజ్​ చేసిన వైన్​ విలువ లక్షా 50వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కాప్రా ఎక్సయిజ్​ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Also Read: Server Glitch: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిలిచిపోయిన సేవలు..!

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×