E-Paper
Advertisement

Server Glitch: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిలిచిపోయిన సేవలు..!

Server Glitch: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిలిచిపోయిన సేవలు..!
Advertisement

Server Glitch: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సర్వర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ సేవలు గంటలపాటు నిలిచిపోయాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, విక్రయ ఒప్పందాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ) తదితర సేవల కోసం ఉదయం నుంచే కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసంతృప్తి వ్యక్తం..

సర్వర్ పనిచేయకపోవడంతో టోకెన్లు తీసుకున్న వారు, ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారి పనులు పూర్తికాక నిరాశతో వెనుదిరిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమయం, ప్రయాణ వ్యయం వృథా అయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన కొనుగోలుదారులు, విక్రేతలు, డాక్యుమెంట్ రైటర్లు, న్యాయవాదులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు కూడా సర్వర్ సమస్యతో పనులు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రిజిస్ట్రేషన్లు వాయిదా పడటంతో ఆర్థిక లావాదేవీలు ఆలస్యమైనట్లు తెలిపారు.

Advertisement

Also read: HYDRAA Powers: జీహెచ్‌ఎంసీ పవర్స్‌కు ఇక బ్రేక్.. పవర్స్ అంతా హైడ్రాకే.. క్యూర్ బిల్లు అసలు ప్లాన్ ఇదే..?

సర్వర్ సమస్యలు..

సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులకు సమాచారం అందించామని, సేవలను త్వరితగతినపునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. సర్వర్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Also read: మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 15 మంది

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×