E-Paper
Advertisement

టీవీ షో కోసం వస్తే.. ఇంత ఘోరమా? హైదరాబాద్‌లో మహిళపై దారుణం!

టీవీ షో కోసం వస్తే.. ఇంత ఘోరమా? హైదరాబాద్‌లో మహిళపై దారుణం!
Advertisement

Hyderabad Crime: భర్తతో ఉన్న విభేధాల పరిష్కారం కోసం ఓ టీవీ షోలో పాల్గొనటానికి వచ్చిన మహిళపై ఇద్దరు అఘాయిత్యం జరిపారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మహంకాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే, రెండు సంవత్సరాలుగా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో భరించలేక పోయిన ఆమె విడిగా ఉంటోంది.

అయితే ఈ తరహా వివాదాలను పరష్కరించే ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యను పరిష్కరించుకోవాలని మహిళ భావించింది. ఇందుకోసం నగరానికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన ఓ వ్యక్తి టీవీ షో నిర్వాహకులు తనకు బాగా తెలుసని చెప్పి నమ్మించాడు. తనతోపాటు వస్తే వారి వద్దకు తీసుకెళతానన్నాడు.

Advertisement

Also Read: స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగానికి చెక్.. సీక్రెట్ రికార్డింగ్స్ అడ్డుకునేందుకు.. మెటా సరికొత్త టెక్నాలజీ!

అనంతరం బాధితురాలిని సికింద్రాబాద్ రాణిగంజ్​ ప్రాంతంలోని హైదర్​ కాంప్లెక్స్​ కు తీసుకెళ్లాడు. అక్కడ బెదిరించి మహిళపై అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా బాధితురాలిపై లైంగిక దాడి జరిపాడు. దాంతో బాధితురాలు గట్టిగా కేకలు పెట్టగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన మహంకాళి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read: ఇదేందయ్యా ఇది.. తాటిచెట్టుకు ఇనుప మెట్లా? ఈ రైతు తెలివికి సెల్యూట్!

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×