E-Paper
Advertisement

15 రోజుల్లో 618 ఫోన్ల ట్యాపింగ్.. సిట్ వలలో ముగ్గురు బీఆర్ఎస్ బడా నేతలు!

15 రోజుల్లో 618 ఫోన్ల ట్యాపింగ్.. సిట్ వలలో ముగ్గురు బీఆర్ఎస్ బడా నేతలు!
Advertisement

Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సుదీర్ఘ కాలం పాటు గుట్టుచప్పుడు కాకుండా సాగిన సిట్ (SIT) విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో సేకరించిన పక్కా ఆధారాలతో దర్యాప్తు బృందం త్వరలోనే కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. అయితే, ఈ ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలను నిందితులుగా చేర్చినట్లు వస్తున్న సమాచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

వందల మంది సాక్ష్యాలు.. పక్కా ఆధారాలు

Advertisement

ఈ కేసును ఛేదించేందుకు సిట్ అధికారులు ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంక్వైరీలో భాగంగా వందలాది మంది సాక్షుల వాంగ్మూలాలను, తిరుగులేని డిజిటల్ రికార్డులను సేకరించారు. కీలక రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులను సైతం సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఈ మొత్తం డాక్యుమెంట్లు, ఎవిడెన్స్‌ ఆధారంగానే సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌తో పాటు మెమోను కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం లీగల్ ఎక్స్‌పర్ట్స్ (న్యాయ నిపుణుల) తుది అభిప్రాయాన్ని తీసుకుంటున్న అధికారులు, అది పూర్తి కాగానే కోర్టుకు సమర్పించనున్నారు.

Also Read: భార్య, ప్రియుడు.. ఒక మర్డర్ స్కెచ్! మియాపూర్ సత్యవతి క్రైమ్ స్టోరీ!

Advertisement

15 రోజుల్లో 600 మందిపై ట్యాపింగ్!

సిట్ జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఎస్ఐబీ (S.I.B) చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు సారథ్యంలో నిఘా వ్యవస్థను దారుణంగా దుర్వినియోగం చేసినట్లు తేలింది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, నవంబర్ 15 నుంచి 30 వరకు.. అంటే కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 618 మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. అంతేకాదు, మరో 4,103 మంది కదలికలపై నిరంతరం నిఘా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పక్కా టెక్నికల్ ఎవిడెన్స్‌ను కోర్టు ముందుంచనున్నారు.

రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ

ఈ నివేదికలో ప్రభాకర్ రావు నియామకం నేపథ్యం నుంచి మొదలుకొని వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూ వరకు ప్రతి అంశాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఏమిటంటే.. ఆ ‘ముగ్గురు’ బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరు? అనేదే. ఛార్జ్‌షీట్‌లో ఉన్న ఆ ముగ్గురు కీలక నేతల పేర్లు అధికారికంగా బయటకు వస్తే.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ కుదుపు రావడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.

Also Read: వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?

Related News

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

Big Stories

Advertisement
×