E-Paper
Advertisement

VLR Dairy: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కల్తీ పెరుగు దందాపై అధికారులు ఉక్కుపాదం.. కోర్టు సంచలన తీర్పు!

VLR Dairy: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కల్తీ పెరుగు దందాపై అధికారులు ఉక్కుపాదం.. కోర్టు సంచలన తీర్పు!
Advertisement

VLR Dairy: స్వేచ్ఛ బ్యూరో: హుజురాబాద్ పట్టణ పరిధిలోని సైదాపూర్ రోడ్డులో గల ‘వీఎల్ఆర్ పాల డైరీ’ (VLR Dairy) లో నాణ్యత లేని, కల్తీ పెరుగు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చల్లాటమాడుతున్న ఉదంతం ల్యాబ్ నివేదికల్లో బట్టబయలైంది. ఈ ఘోర కల్తీపై కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (ఆదాయ విభాగం) శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తూ సదరు ‘వీఎల్ఆర్ డైరీ’ యాజమాన్యానికి పదివేల రూపాయల (రూ. 10,000/-) జరిమానా విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. స్థానిక ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమైన వరుస పరిశోధనాత్మక కథనాలకు స్పందించిన ఆహార భద్రతా అధికారులు క్షేత్రస్థాయిలో మెరుపు దాడులు నిర్వహించి ఈ చర్యలు చేపట్టారు.

‘వీఎల్ఆర్ డైరీ’ పెరుగులో వెన్న శాతం సగానికి పైగా తక్కువ..

గతంలో ఆహార భద్రతా అధికారులు ‘వీఎల్ఆర్ డైరీ’ కేంద్రం నుండి సేకరించిన పెరుగు నమూనాలను నాణ్యతా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఇటీవల అందిన అధికారుల నివేదికలో సదరు పెరుగు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేదని శాస్త్రీయంగా తేలింది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం పెరుగులో కనీసం 5 శాతం వెన్న (ఫ్యాట్) ఉండాల్సి ఉండగా, ఈ ‘వీఎల్ఆర్ డైరీ’ పెరుగులో కేవలం 2.05 శాతం మాత్రమే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అంటే సగానికి పైగా వెన్నను తీసేసి, నాణ్యత లేని పెరుగును ప్రజలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ల్యాబ్ రిపోర్టుతో రుజువైంది.

Advertisement

Also Read: Village Development: తెలంగాణ పల్లెల్లో సరికొత్త ప్రగతి శకం.. ప్రతి నెలకు 1,000 పని దినాలుండేలా సర్కార్ బిగ్ ప్లాన్!

ప్రజారోగ్యానికి భంగం

ఈ నివేదిక ఆధారంగా ఆహార భద్రతా అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, అదనపు కలెక్టర్ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం ప్రజారోగ్యానికి భంగం కలిగించినందుకు గాను ‘వీఎల్ఆర్ పాల డైరీ’ కి రూ. 10,000/- జరిమానా విధించింది. అయితే, సదరు యాజమాన్యం ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకుని వాదించుకోవడం వలనే చట్టప్రకారం ఈ రూ. 10,000/- జరిమానా మొత్తం కొంత తక్కువగా విధించబడిందని చట్ట నిపుణులు విశ్లేషించారు.

కల్తీని అడ్డుకున్న ‘స్వేచ్ఛ’ పత్రికకు అభినందనలు..

Advertisement

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కల్తీ ముఠా గుట్టును ఎంతో సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చిన ‘స్వేచ్ఛ’ దినపత్రిక యాజమాన్యానికి, స్థానిక విలేఖర్ వెంకటస్వామి కి హుజురాబాద్ పట్టణ ప్రజలు, వినియోగదారుల సంఘాలు ముక్తకంఠంతో కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. పత్రికా కథనాల వల్లే అధికారులు త్వరితగతిన స్పందించి తనిఖీలు చేపట్టారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ‘వీఎల్ఆర్ డైరీ’ వంటి కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచి, తనిఖీలు నిర్వహించి కల్తీ రహిత సమాజానికి అధికారులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: HYDRAA Powers: జీహెచ్‌ఎంసీ పవర్స్‌కు ఇక బ్రేక్.. పవర్స్ అంతా హైడ్రాకే.. క్యూర్ బిల్లు అసలు ప్లాన్ ఇదే..?

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×