E-Paper
Advertisement

సోదరి అన్షు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ వాచ్.. ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

సోదరి అన్షు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ వాచ్.. ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!
Advertisement

Janhvi Kapoor: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు ఘనంగా మోగాయి. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ దివంగత మొదటి భార్య మోనా శౌరీ కపూర్ కూతురు అన్షులా కపూర్ వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అన్షులా కపూర్ పెళ్లి వేడుకల్లో కపూర్ సిస్టర్స్ అయిన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తమ అందాలతో ఆకట్టుకున్నారు. అంతేకాదు తాము ధరించిన లగ్జరీ వస్తువులతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఇక అందులో భాగంగానే తన సోదరీ వివాహంలో జాన్వీ కపూర్ ధరించిన లగ్జరీ వాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది.

సోదరి పెళ్లిలో జాన్వీ కపూర్ ధరించిన వాచ్ ప్రత్యేకతలు..

ప్రముఖ సినీ నిర్మాత బోనీకపూర్ కుమార్తె అన్షులా కపూర్ తన ప్రియుడు, ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత రోహన్ థక్కర్ తో కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు వేశారు. జూలై 6వ తేదీన ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ లో పంజాబీ, గుజరాతీ సాంప్రదాయాల మేళవింపుతో చాలా ప్రైవేటుగా సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లి అనంతరం జరిగిన కార్యక్రమంలో జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. అందులో ఆమె ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. పాటెక్ ఫిలిం కంపెనీకి చెందిన రోజ్ గోల్డ్ కలర్ చేతి గడియారం తన అవుట్ ఫిట్ లో హైలెట్ గా నిలిచింది. డయల్ లో 251 వజ్రాలు, స్ట్రాప్ పై 79 ఆకోయ్ ముత్యాలతో ఈ వాచ్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

వాచ్ ఖరీదు ఎంతంటే?

Advertisement

ఇకపోతే జాన్వీ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర అక్షరాల రూ.2.50 కోట్లు కావడం గమనార్హం. మొత్తానికైతే జాన్వీ కపూర్ తన సోదరి పెళ్లిలో తన హుందాతనాన్ని చూపించి అందరిని మెస్వరైజ్ చేసింది.

జాన్వీ కపూర్ సినిమాలు..

బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ తెలుగులో.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ ఏడాది బుచ్చి బాబు సనా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో హీరోయిన్గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తమిళంలో ఒక వెబ్ సిరీస్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గత కొంతకాలంగా పలువురు దర్శకులు ఈమెను సంప్రదించగా.. చివరికి కోలీవుడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

 

also read: సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

Related News

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

Big Stories

Advertisement
×