Mandakrishna Madiga:ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వాగతిస్తున్నామన్నారు. ఏకసభ్య కమిషన్ మీద వర్గీకరణకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. రామచంద్రన్ కమిషన్, ఉషా మెహ్రా కమిషన్, షేమీమ్ అక్తర్ కమిషన్ ప్రభుత్వాలు ఏ కమిషన్ వేసినా ఆ నివేదకలు వర్గీకరణకు సానుకూలంగానే ఉన్నాయన్నారు.
అయితే, వర్గీకరణలో ఏవైనా లోపాలు జరిగితే.. ప్రభుత్వం సరి చేసుకోవాలని ఉషా మెహ్రా కమిషన్‌కు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. 59 కులాల్లో మాదిగల జనాభా ఎంత ఉందో దాని ప్రకారనమే తమ వాటా కావాలని ఉషా మెహ్రా కమిషన్‌కు వినతి పత్రం సమర్పించామని పేర్కొన్నారు. ‘ఇతర కులస్థులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. 10 నుంచి 11 శాతం వాటా మాకు రావాలి, కానీ 9 శాతం ఇచ్చారు. అది సబబు కాదు. మాదిగలకు 9 శాతం వాటా ఏ ప్రాతిపదికన ఇచ్చారు..? మాలలు వర్గీకరణను అడ్డుకుంటున్నారు. 15 లక్షల జనాభా కలిగిన మాలలకు 5 శాతం ఇస్తే, 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం వాటా రావాలి. మాదిగలను 9 శాతానికి ఎందుకు కుదించారు..? జనాభా ప్రకారమే కదా రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది. మా జనాభా ప్రకారం మాకు దక్కాల్సిన వాట దక్కలేదు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రభుత్వం వెనకబాటుగా గుర్తించి మొదటి గ్రూపులో 15 కులాల జనాభాను కలిపి 1 శాతం వాటా ఇచ్చారు. జనాభా చూసినా, వెనక బాటును చూసిన 11 శాతం వాటా మాకు వస్తుంది’ అని మందకృష్ణ అన్నారు.
మొదటి గ్రూపులో అత్యంత అడ్వాన్స్ కులాన్ని తీసుకొచ్చి పెట్టారు. గంట చక్రపాణి కులం పంబాల. గంట చక్రపాణి ఇంట్లోనే ముగ్గురు ప్రొఫెసర్లు ఉన్నారు. మాల కులంలో కలవాలని పంబాల కులస్తులకు చెప్పింది గంట చక్రపాణి. పంబాల కులస్తులకు చాలా మంది ఫోన్లు చేసి మాల కులంలో చేరొద్దని గంట చక్రపాణి చెప్పారు. అభివృద్ధి చెందిన పంబాల కులాన్ని వెనకబాటు గురైన కులాల్లో పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి..? దోచుకోవడం కోసం పంబాల కులాన్ని వెనక బడిన కులాల మధ్యలోకి తెచ్చి పెట్టారా..? పంబాల కులాన్ని మొదటి గ్రూపులో చేర్చడం వెనక కుట్ర పూరితం ఉంది. నేతకానీ కులస్తులను మూడో గ్రూపులో చేర్చడం వెనక కుట్ర జరిగింది.. నాడు తెలంగాణ ఇస్తూనే 6 మండలాలను సీమాంధ్రలో కలిపారు. నాడు 6 మండలాలపై కేసీఆర్ మౌనం పాటించారు. నేను కేసీఆర్ లా మౌనంగా ఉండలేను, కేసీఆర్ లాంటోన్ని కాదు. ఇప్పుడు కూడా మాదిగల వర్గీకరణపై అదే జరుగుతుంది. వర్గీకరణ చేస్తూనే చేయాల్సిన అన్యాయం చేస్తున్నారు. పెద్దపల్లిలో గెలిచేందుకు నేతకాని కులస్తులకు కార్పొరేషన్ కావాలని కోరిన వివేక్ ప్రస్తుతం ఆ కులస్థుల గురించి ఎందుకు మాట్లాడుతలేరు..? మాలల జనాభా లేకపోయినా మాలల పక్షాన నిలబడి వివేక్ సక్సెస్ అయ్యారు. వర్గీకరణ అశాస్త్రీయంగా ఉంది. వర్గీకరణలో కుట్ర దాగుంది’ అని మందకృష్ణ వ్యాఖ్యానించారు.
వర్గీకరణలో మాదిగలకు రావల్సిన వాటాను సాధించడంలో దామోదర రాజ నర్సింహ పూర్తిగా విఫలం అయ్యారు. దామోదర్ రాజనర్సింహను మా మాదిగ మంత్రిగా చూడటం లేదు. మాదిగల పేరుతో మంత్రిగా ఉన్న రాజనర్సింహ మౌనంగా ఉన్నారు. మాదిగల పేరు మీద మంత్రిగా కొనసాగే అర్హత దామోదర్ రాజనర్సింహకు లేదు. దామోదర రాజనర్సింహ మాదిగల ప్రయోజనాలను కాపడలేరు, మేము ఆయనను మాదిగల ప్రతినిధిగా చూడటం లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కోరుతున్న రాజనర్సింహని మంత్రి వర్గంలో నుంచి భర్తరఫ్ చేయాలి. మాదిగల నుంచి ఇద్దరినీ మంత్రి వర్గంలోకి తీసుకోండి. మాదిగల ప్రయోజనాలకు పనికి రాని, కాపాడలేని దామోదర రాజనర్సింహ మాకెందుకు..?మాదిగలకు న్యాయంగా వాటా దక్కలేదని ముఖ్యమంత్రికి తెలుసు.. ఎవరో ఒకరితో సీఎం సంభాషణ చేసిన సందర్భంగా మాదిగలకు దక్కిన వాటాపై చర్చ జరిగినట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రి 40 నిమిషాల పాటు ఒకరితో ఫోన్ లో చర్చించారు. మాదిగలకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రే చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి మాకు అన్యాయం జరిగింది. అసెంబ్లీ లో మాట్లాడాలని పాయల్ శంకర్ ను కోరాం, ఆ టైమ్ కి స్పీకర్ శంకర్ కు అవకాశం ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు.
Also Read: BRS Defected MLAs: దానం నాగేందర్ ఇంట్లో ఆ MLAలు భేటీ.. తెలంగాణలో అసలేం జరుగుతుంది..?
మాదిగల వర్గీకరణలో క్రిమి లేయర్ ఉండాలని కమిషన్ చెప్పింది, కానీ దాన్ని ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది..? మాదిగల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు వివేక్ ప్రయత్న చేశారు. మాదిగలకు అన్యాయం జరగడంలో వివేక్, దామోదర్ రాజనర్సింహలు కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రికి తెలిసే అన్ని జరగాయని భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే అశాస్త్రీయంగా ఉన్నా వర్గీకరణ లోపాలను సరి చేయాలని కోరుతున్నాం. ఈ 7న జరిగే లక్ష డప్పుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. ముఖ్యమంత్రి కావాలనే ఈ కార్యక్రమాన్ని ఆపారని తెలుస్తోంది. మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు. వర్గీకరణకు సంబంధంలేకుండా లక్ష డప్పుల కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. త్వరలోనే లక్ష డప్పుల కార్యక్రమం తేదీని ప్రకటిస్తాం’ అని మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు.