E-Paper
Advertisement

BRS Defected MLAs: దానం నాగేందర్ ఇంట్లో ఆ MLAలు భేటీ.. తెలంగాణలో అసలేం జరుగుతుంది..?

BRS Defected MLAs: దానం నాగేందర్ ఇంట్లో ఆ MLAలు భేటీ.. తెలంగాణలో అసలేం జరుగుతుంది..?
Advertisement

BRS Defected MLAs: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు అందుకున్న ఈ పది మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిబ్రవరి 4 న ఈ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ సెక్రటరీతో పాటు సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే అంశంపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి..? అనే అంశంపై భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకోర్టు కు ఇచ్చే ఆన్సర్లపై కూడా చర్చ జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. పార్టీ పార్టీయింపులకు పాల్పడిన ఈ ఎమ్మెల్యేలందరూ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? అనే దానిపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీకి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్పు వ్యవహారంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయించిన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని అడిగారు.  2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని దారుణ ఓటమిని చవిచూసింది. అయితే.. బీఆర్ఎస్ ఓటమి అనంతరం కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి క్యూకట్టారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలోకి చేరారు. తర్వాత, అయితే ఇంకొంత మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడుతారనే టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత ఎవరూ కాంగ్రెస్ పార్టీలో వెళ్లలేదు.

Also Read: HDFC Bank Jobs: డిగ్రీ అర్హతతో HDFCలో 500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్..

Advertisement

పార్టీ ఫిరాయించిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో బీఆర్‌ఎస్ కు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నిన్న ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యం కారణంగా ఎమ్మెల్యేలు నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలని భేటీ అయినట్లు తెలుస్తోంది.

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×