Mandakrishna Madiga: ఇవాళ కేంద్ర పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఆయన చేసిన కృషికి గానూ ఆయనను కేంద్రం పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది. కేంద్రం మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.
అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు సైతం వరించాయి. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ పురస్కారం వరించగా.. కళారంగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. అలాగే పద్మశ్రీ పురస్కారం ఐదుగురికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కేఎల్ కృష్ణకు విద్యా, సాహిత్యం రంగలో, ఏపీకి చెందిన మాడుగుల నాగఫణి శర్మకు కళారంగంలో, మందకృష్ణ మాదిగకు ప్రజా వ్యవహారాల విభాగంలో, ఏపీకి చెందిన మిరయాల అప్పారావుకు కళారంగంలో, ఏపీకి చెందిన వి.రాఘవేంద్రాచార్య పంచముఖికి విద్యా, సాహిత్యం రంగంలో పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి.
పద్మ అవార్డుల్లో తెలుగు వారు వీరే..
పద్మ విభూషణ్ – దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, వైద్యం(ఏపీ)
పద్మ భూషణ్ – నందమూరి బాలకృష్ణ, కళారంగం(ఏపీ)
పద్మశ్రీ – కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం (ఏపీ)
పద్మశ్రీ – మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం (ఏపీ)
పద్మశ్రీ – మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు (తెలంగాణ)
పద్మశ్రీ – మిరియాల అప్పారావు, కళారంగం (ఏపీ)
పద్మశ్రీ- వి రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య (ఏపీ)
మందకృష్ణ మాదిగ నేపథ్యమిదే..
మందకృష్ణ మాదిగ వరంగల్ జిల్లా హంటర్ రోడ్డు సమీపంలోని శాయంపేటలో జన్మించారు. ఈయన సామాజిక కార్యకర్త. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్సీ కులాలను జనాభా నిష్ఫత్తి ప్రకారం విభజించి.. దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో దండోర ఉద్యమం ముందుకొచ్చింది.
మాదిగ దండోరా ప్రకాశంలో జిల్లాలో 20 మంది యువకులతో ఏర్పిడింది. అణగారిన కులాల, ఆత్మ గౌరవం, సమన్యాయం పంపిణీ విలువల ఆశయాలతో ఏర్పడిని దండోరా కార్యక్రమం తక్కువ కాలంలోనే ఉద్యమం సంస్థగా ఎదిగింది.