BigTV English

Viral News : మామిడి చెట్లకు పెళ్లి.. ఎందుకు చేశారో తెలిస్తే…

Viral News : మామిడి చెట్లకు పెళ్లి.. ఎందుకు చేశారో తెలిస్తే…

Viral News : మనుషులకు పెళ్లి. లేడీ అఘోరీ – శ్రీవర్షిణిలకు పెళ్లి. ఆవులకు పెళ్లి. కప్పలకు పెళ్లి. వేప-రాగి చెట్లకు పెళ్లి. ఇలా రకరకాల పెళ్లిల గురించి వింటూ ఉంటాం. వాటిల్లోకి ఇది కాస్త డిఫరెంట్. రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశాడు ఓ రైతు. ఎందుకంటే..


మొక్కలపై మమకారం..

జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరలో ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేశారు ఓగుల అనిల్, అజయ్ దంపతులు. మొక్కలు నాటినప్పటి నుంచి వాటిని కన్న బిడ్డలుగా చూసుకున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తెగుళ్లు రాకుండా, పురుగులు పట్టకుండా.. జాగ్రత్తగా తోట సాగు చేశారు. అలా నాలుగేళ్లు కష్టపడ్డారు. ఓపిగ్గా ఎదురుచూశారు. ఆ మొక్కలు చెట్లుగా ఎదిగాయి. ఇన్నేళ్ల తర్వాత పూత వచ్చింది. తొలి కాపు కాసింది. ఆ రైతు దంపతుల ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఆ హ్యాపీనెస్ తామొక్కరమే అనుభవించాలని అనుకోలేదు. అందుకే, ఇన్నేళ్లూ ఆప్యాయంగా చూసుకున్న ఆ మామిడి మొక్కలకు పెళ్లి చేయాలని భావించారు. ఆ సంతోషం అందరితో పంచుకోవాలని తలిచారు.


అచ్చం మన పెళ్లిలానే..

పెళ్లి అంటే ఏదో తూతూమంత్రంగా కాదు. అచ్చం మన పెళ్లిలానే చేశారు. పండితులను పిలిపించారు. బంధువులు, స్నేహితులను ఇన్వైట్ చేశారు. బీర్‌పూర్‌ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకులు వొద్దివర్తి మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా వివాహ తంతు నిర్వహించారు.

Also Read : అఘోరీ దగ్గరికి వెళ్లిపోయిన వర్షిణి.. హ్యాపీ ఎండింగ్!

జీలకర్ర బెల్లం.. మంగళసూత్రం.. వివాహ భోజనం

రెండు ఎంపిక చేసిన మామిడి చెట్లకు నూతన వస్త్రాలు చుట్టారు. ఆ రెండు చెట్లనే వధువు, వరుడిగా అలంకరించారు. పూలదండలు వేశారు. శాస్త్రోక్తంగా మంత్రాలు చదివారు. జీలకర్ర బెల్లం ధరింపజేశారు. మేళతాళాల మధ్య మాంగళ్యధారణ చేయించారు. మనుషులకు చేసినట్టే పద్దతిగా ఘనంగా మామిడి చెట్లకు పెళ్లి చేశారు. ఈ వివాహ వేడుకకు గ్రామంలోని పలువురు రైతులు హాజరయ్యారు. ఆ మామిడి తోట మంచిగా కాపు కాయాలని దీవించారు. పెళ్లికి వచ్చిన వారందరికీ సహపంక్తి భోజనం కూడా ఏర్పాటు చేశారు. అలా మామిడి తోటపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు ఆ రైతు దంపతులు. మామిడి చెట్లకు పెళ్లి చేసిన ఉదంతాన్ని.. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. భలే చేశారే అని మెచ్చుకుంటున్నారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×