BigTV English

Vishwambhara: విశ్వంభర లిరికల్ సాంగ్ లో ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..?

Vishwambhara:  విశ్వంభర లిరికల్ సాంగ్ లో ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. త్రిష(Trisha ) హీరోయిన్ గా చాలా సంవత్సరాల తర్వాత జతకట్టబోతున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). వశిష్ట మల్లిడి (Vassistha Mallidi) దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి తాజాగా “రామ రామ” అనే పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాసారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సాంగ్లో మెగాస్టార్ పక్కన ఒక యంగ్ బ్యూటీ కనిపించింది.


విశ్వంభర మూవీలో స్టార్ బ్యూటీ..

చిరంజీవి పక్కన చిరంజీవి తో పాటు స్టెప్పులేసిన ఈ యంగ్ హీరోయిన్ ని మీరు గుర్తుపట్టారా ? ఈమె చేసింది తక్కువ సినిమాలు అయినా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకొని, ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఆమె ఎవరో కాదు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన రమ్య పసుపులేటి (Ramya Pasupuleti). ‘హుషారు’ సినిమాతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించింది. ఇక ఇటీవల :మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన అందం , అభినయంతో ఒక్కసారిగా కట్టి పడేసింది. ఇకపోతే రమ్య పసుపులేటి విశ్వంభర సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. కానీ దానిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇప్పుడు విడుదల చేసిన లిరికల్ సాంగ్ లో చిరంజీవితో పాటు స్టెప్ వేయడంతో అందరూ కన్ఫామ్ అయిపోతున్నారు. ఇంకా ఇందులో ఆయనకు చెల్లిగా నటిస్తోందా లేక మరేదైనా పాత్రలో నటిస్తోందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ రెట్టింపు అవ్వడం ఖాయం అని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.


V.K.Naresh: అవసరమా ఈ వయసులో.. నరేష్ మామ..!

రమ్య పసుపులేటి సినిమాలు..

రమ్య పసుపులేటి విషయానికి వస్తే.. ఇక రమ్య విషయానికొస్తే.. 2018లో విడుదలైన హుషారు సినిమాతో తన కెరీర్ ను ఆరంభించింది. ఆ తర్వాత ఫస్ట్ ర్యాంకు రాజు సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత బీ ఎఫ్ ఎఫ్ (బెస్ట్ ఫ్లాట్ మేట్ ఫరెవర్) వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించి, గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాదు 2025లో నార్నే నితిన్ , సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమా డబుల్ సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు. అటు కమర్షియల్ పరంగా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అంతలోని విశ్వంభర సినిమాలో నటిస్తున్నట్లు మనకు ఆధారాలతో సహా బయటకు వచ్చేసింది. మరి ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని హీరోయిన్గా అవకాశాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×