Shinkansen ‘Kiss’ In Japan: ముద్దు పెట్టుకునే రైళ్లు. వినాడానికి ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజం. జపాన్ ఈ ముద్దుపెట్టుకునే రైళ్లు కనిపిస్తాయి. రెండు షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ పై నెమ్మదిగా ఒకదానికొకటి దగ్గరగా చేరుకుని రెండు ముక్కులు ఆనుకుంటాయి. ఈ రెండు రైళ్లు తరచుగా ఇలాగే దగ్గరగా వస్తాయి. ఈ రెండు రైళ్లు ముద్దు పెట్టుకునే సీన్ అచ్చం సినిమా దృశ్యాన్ని తలపిస్తోంది.
ఈ అద్భుత దృశ్యం ఎక్కడ జరుగుతుంది?
ఈ ముద్దు పెట్టుకునే రైళ్లను చూడాలంటే మోరియోకాకు వెళ్లాలి. ఇక్కడ పలు రైళ్లు రెగ్యులర్ గా ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా కనెక్ట్ అవుతాయి. ప్రయాణం పూర్తయ్యాక రెండు రైళ్లు దగ్గర అవుతాయి. మరుసటి రోజు ప్రయాణం మొదలయ్యే సమయానికి మళ్లీ డిస్‌కనెక్ట్ అవుతాయి. ఈ రెండు రైళ్లు ముందు భాగాలు చాలా సొగసుగా కనిపిస్తాయి. వంపు తిరిగి పక్షిలా ఉంటాయి. సో, ఇవి దగ్గరగా వచ్చినప్పుడు, అవి నిజంగా ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ దృశ్యాలలో అత్యంత ప్రసిద్ధమైనది తోహోకు, అకిటా రైళ్ల కలయిక. ఆకుపచ్చ టోహోకు షింకన్‌సెన్ ‘హయాబుసా’ మొదట ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశిస్తుంది. ఇది జపాన్ హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ లో అత్యంతకు వేగవంతమైన రైలు. ఈ రైలు వచ్చి ట్రాక్ మీద ఆగిన తర్వాత, కొద్ది సేపటికి అద్భుతమైన ఎరుపు రంగు అకితా షింకన్ సెన్ ‘కొమాచి’ అదే ట్రాక్ మీదికి ఎదురుగా వస్తుంది. రెండు రైళ్లు ఒకదానికొకటి, ఆనుకుని నిల్చుంటాయి. ఈ రైళ్లు చూస్తే, కచ్చితంగా రెండూ ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తాయి.
ఇక రైలు స్పాటింగ్ జపాన్ రైల్వేలోనే ఐకానిక్ గా ఉంటుంది. వాస్తవానికి చాలా మంది తమ ఇష్టమైన రైళ్లుగా వీటిని గుర్తిస్తారు. జపాన్ లో అత్యంత వేగంగా ప్రవేశించే రైళ్లలో ఇవి ముందు వరుసలో ఉంటాయి. ఈ దృశ్యాన్ని యునో, సెండాయ్, ఫుకుషిమాతో సహా ఇతర స్టేషన్లలో కూడా చూడవచ్చు. కానీ.. మోరియోకాలో రెండు రంగుల రైళ్లు ఎదురెదురుగా ఆగడం వల్ల అత్యంత ప్రాచుర్యం పొందింది.
Read Also: సమ్మర్ కి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఏపీకి 24 స్పెషల్ రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!
షింకన్ సెన్ అకా జపాన్ బుల్లెట్ రైళ్ల గురించి..
షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు జపాన్ లో చాలా ఫేమస్. అత్యంత వేగం, కచ్చితత్వం, అత్యాధునిక సౌకర్యాలకు పెట్టింది పేరు. 1964లో ప్రారంభించబడిన ఈ హైస్పీడ్ రైలు రోజు రోజుకు అత్భుతంగా అప్ డేట్ అవుతోంది. ఈ రైలు డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లు టోక్యో, ఒసాకా, క్యోటో లాంటి ప్రధాన నగరాలను కలుపుతూ ప్రయాణిస్తాయి. దేశ వ్యాప్తంగా వేల కిలో మీటర్ల దూరం జర్నీ చేస్తాయి
Read Also: ఏప్రిల్ 15 నుంచి రైల్వే తత్కాల్ టైమింగ్స్ మారుతున్నాయా?