E-Paper
Advertisement

రాముడి ఊరి నుంచి సీతమ్మ ఊరికి రైలు.. ప్రయాణికులకు త్వరలోనే కొత్త సౌకర్యం!

రాముడి ఊరి నుంచి సీతమ్మ ఊరికి రైలు.. ప్రయాణికులకు త్వరలోనే కొత్త సౌకర్యం!
Advertisement

Ayodhya–Janakpur Rail Link: రామాయణంతో సంబంధం ఉన్న రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలను రైలు మార్గం ద్వారా అనుసంధానించే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, నేపాల్‌లోని జనక్‌ పూర్ మధ్య ప్రతిపాదించిన రైలు సర్వీసుకు ట్రయల్ రన్ సక్సెస్ పుల్ గా పూర్తయింది. ఈ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే భారత్, నేపాల్ మధ్య ప్రయాణించే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా రామాయణ యాత్ర చేయాలనుకునే వారికి ఒకే ప్రయాణంలో రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.

భారత్-నేపాల్ మధ్య మరో కీలక ముందడుగు

అయోధ్య-జనక్‌ పూర్ రైలు సర్వీసుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించిన విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. తాజాగా నేపాల్ రాజధాని ఖాఠ్మండులో ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలను ప్రకటించారు.  ఈ ప్రతిపాదిత రైలు సేవ రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.

రాముడు, సీతాదేవితో ముడిపడిన రెండు పుణ్యక్షేత్రాలు

Advertisement

అయోధ్య అంటే శ్రీరాముడి జన్మస్థలం. ఇక నేపాల్‌లోని జనక్‌పూర్‌ను సీతాదేవి జన్మస్థలంగా భక్తులు నమ్ముతారు. ఈ రెండు ప్రాంతాలకు రామాయణంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం భారత్‌ తో పాటు నేపాల్, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఇప్పటి వరకు ఈ రెండు పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో సందర్శించాలంటే ప్రయాణికులు వేర్వేరు రవాణా మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చేది. నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తగ్గుతాయి. భక్తులు తమ ప్రయాణాన్ని మరింత సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.

పర్యాటక రంగానికి  సూపర్ బూస్ట్

ఈ రైలు మార్గం కేవలం యాత్రికులకే కాకుండా స్థానిక వ్యాపారులకు కూడా ఉపయోగపడనుంది. రెండు ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలు పెరిగితే హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక రవాణా సేవలు, వ్యాపారాలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయి. రెండు దేశాల మధ్య పర్యాటక సహకారానికి కూడా ఈ రైలు సర్వీసు దోహదపడుతుంది.

రైలు ప్రారంభం ఎప్పుడంటే?   

Advertisement

ట్రయల్ రన్ పూర్తయినప్పటికీ సాధారణ ప్రయాణికుల కోసం ఈ రైలు సర్వీసు ఇంకా ప్రారంభం కాలేదు. రైలు ప్రారంభ తేదీ, ప్రయాణ సమయాలు, టికెట్ ధరలు, ఇమ్మిగ్రేషన్ విధానాలు, ఇతర అంశాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే అయోధ్య, జనక్‌పూర్‌లను కలుపుతూ రామాయణ పుణ్యక్షేత్రాల యాత్ర మరింత ఈజీ కానుంది.

Read Also: పాస్‌పోర్ట్ లేకుండా నేపాల్, భూటాన్ వెళ్లొచ్చా? కొత్త రూల్స్ వచ్చేశాయ్!

Tags

Related News

పాస్‌పోర్ట్ లేకుండా నేపాల్, భూటాన్ వెళ్లొచ్చా? కొత్త రూల్స్ వచ్చేశాయ్!

ఇసుకను చీల్చుకుంటూ బయటకు వస్తున్న భారీ చెయ్యి.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న వింత శిల్పం!

ఇక్కడ ఇళ్లన్నీ మట్టితోనే కట్టారు.. అయినా వందల ఏళ్లుగా చెక్కుచెదరలేదు!

పండుగ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి 18 వేల స్పెషల్ రైళ్లు!

చదువు, మేధస్సులో ప్రపంచానికే బాస్‌లు.. టాప్-5 తెలివైన దేశాలు.. భారత్ స్థానం ఎక్కడంటే?

లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. వామ్మో.. అన్ని మీటర్ల పైనా..

టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!

Big Stories

Advertisement
×